Begin typing your search above and press return to search.

ఈ వయసులో అవసరమా ఆంటీ!

By:  Tupaki Desk   |   24 Aug 2018 1:30 AM GMT
ఈ వయసులో అవసరమా ఆంటీ!
X
అందానికి వయసుతో పని లేదా అంటే ఖచ్చితంగా ఉందనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే వయసురిత్యా శారీరకంగా వచ్చే మార్పులు ఆడైనా మగైనా అంగీకరించాల్సిందే. కాకపోతే సినిమా హీరోలు కొందరు అరుదుగా తమ గ్లామర్ ని కాపాడుకుంటూ రోల్ మోడల్ గా నిలుస్తూ ఉంటారు. ఇది అందరి వల్ల అయ్యే పని కాదు. ఇక హీరోయిన్ల గురించి చెప్పాల్సిన పని లేదు. 40వ పడిలో పడ్డారంటే ఎంత బ్యూటీ అయినా సరే ఆంటీ అని పిలిపించుకోవాల్సిందే. కానీ అమీషా పటేల్ మాత్రం తాను చాలా స్పెషల్ అంటోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో చేసిన పూరి జగన్నాధ్ మొదటి సినిమా బద్రిలో హీరోయిన్ గా పరిచయమైన అమీషా ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన చేసింది కానీ ఏమంత పేరు రాలేదు. హిందీలో కహో నా ప్యార్ హైతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమీషా తన ఇన్స్ టాగ్రామ్ లో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. ఏవో ఫామిలీ పిక్స్ పోస్ట్ చేస్తుంది అనుకునేరు. పక్కా మసాలా ఫొటోలతో హాట్ హాట్ దర్శనాలు ఇస్తూ ఉంటుంది.

ఒకపక్క కుర్ర భామల ఎక్స్ పోజింగ్ చూడడానికే టైం లేక సతమతమవుతున్న యూత్ కి ఆంటీ ఇలా షో చేస్తే ఎక్కుతుందా. అంతే తన మీద కామెంట్స్ రూపంలో వ్యంగ్య బాణాలు వేయడం మొదలు పెట్టారు. వయసు చూసుకో ఆంటీ అని కొందరు కాదు ఇప్పుడివి అవసరమా అని మరికొందరు ఇలా రకరకాలుగా ఆడుకోవడం మొదలుపెట్టారు. అయినా పైన ఫోటో చూసారుగా. బాడీ షిమ్మర్ ని ఒళ్ళంతా రాసుకుని క్లీవేజ్ ని ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన స్టిల్ మామూలుగా లేదుగా. ఓ మీడియం బడ్జెట్ సినిమాతో బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్న అమీషా పటేల్ తాను ఇంకా హీరోయిన్ అనే భ్రమ నుంచి వీలైనంత త్వరగా బయటికి వస్తే బెటర్. లేకపోతే ఇలా ట్రాలింగ్ కు గురికావాల్సి ఉంటుంది. అయినా ఇలాంటివి చేసినంత మాత్రాన హీరోయిన్ వేషాలు ఇచ్చేస్తారా. అమాయకత్వం కాకపోతే.