Begin typing your search above and press return to search.
హీరోయిన్ పై చీటింగ్ కేసు పెట్టిన ఫైనాన్షియర్
By: Tupaki Desk | 29 March 2019 2:17 PM GMTబాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసి హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న అమీషా పటేల్ గత కొంత కాలంగా ఏదో ఒక వివాదాస్పద అంశంతో మీడియాలో ఉంటుంది. ఆమద్య ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వివాదం మర్చి పోకుండానే మరో వివాదంతో తెరపైకి వచ్చింది. ఈసారి తన సినిమాకు ఫైనాన్స్ చేసిన వ్యక్తిని బెదిరిస్తుందని, డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని కేసు నమోదు అయ్యింది.
హీరోయిన్ గా అవకాశాలు లేని అమీషా పటేల్ సొంత ప్రయత్నాలు చేస్తోంది. కునాల్ గుమార్ అనే నిర్మాతతో కలిసి అమీషా పటేల్ 'దేశీ మ్యూజిక్' అనే చిత్రాన్ని నిర్మించింది. ఆ సినిమాలో స్వయంగా ఆమె నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని సినిమా విడుదల కావడం లేదు. సినిమా విడుదలకు అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అదే సమయంలో సినిమాకు ఫైనాన్స్ చేసిన అజయ్ కుమార్ సింగ్ తన డబ్బు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తీసుకు వచ్చాడట.
2.5 కోట్ల రూపాయల ఫైనాన్స్ ను ఇచ్చిన అజయ్ కుమార్ తన డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరడంతో అమీషా పటేల్ మరియు కునాల్ లు చెక్ ఇచ్చారట. అయితే ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో పాటు, అడిగితే బెదిరిస్తున్నారట. దాంతో అజయ్ కుమార్ కేసు నమోదు చేశాడు. తనకు రావాల్సిన డబ్బు ఇవ్వక పోవడంతో పాటు కొంత మంది ఫొటోలను చూపించి బెదిరిస్తున్నారు అంటూ అమీషా పటేల్ పై అజయ్ కుమార్ కేసు పెట్టాడు. దాంతో చీటింగ్ మరియు చెక్ బౌన్స్ కేసులు హీరోయిన్ పై నమోదు అయ్యాయి. ఈ కేసు నుండి ఆమె ఎలా బయట పడుతుందో చూడాలి.