Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః అందాల వింధుతో ఈ అమ్మడు 20 ఏళ్లు వెనక్కు వెళ్లింది

By:  Tupaki Desk   |   30 March 2021 11:30 PM GMT
ఫొటోటాక్‌ః అందాల వింధుతో ఈ అమ్మడు 20 ఏళ్లు వెనక్కు వెళ్లింది
X
బాలీవుడ్‌ హాట్ బ్యూటీ అమీషా పటేల్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు ఇప్పటికి కూడా బాలీవుడ్‌ లో హాట్ బ్యూటీగా గుర్తింపు దక్కించుకుని వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు మరియు షో లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. అయిదు పదుల వయసు కు దగ్గర పడుతున్నా కూడా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు ఆమె వయసు పాతికేళ్ల వద్దే ఆగిపోయిందా అనిపిస్తుంది అంటున్నారు.

ఇన్ స్టా గ్రామ్‌ లో రెగ్యులర్‌ గా ఈ అమ్మడు హాట్ ఫొటో షూట్‌ లను షేర్‌ చేస్తూ వస్తోంది. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ ఫొటో మరింత హాట్ గా అబ్బ అన్నట్లుగా ఉంది అనడంలో సందేహం లేదు. క్లీవేజ్‌ షో తో పాటు అందాల ఆరబోత విషయంలో చెక్కిన శిల్పం మాదిరిగా ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె రొమాంటిక్‌ స్టైల్‌ స్టాండ్డింగ్ మరియు ఆమె స్కిన్‌ టోన్‌ ఇలా అన్ని కూడా అభిమానులకు మత్తెక్కించేవిగా ఉన్నాయంటూ కామెంట్స్ వినిపస్తున్నాయి. 45 ఏళ్లు దాటిన ఈ అమ్మడు 20 ఏళ్లు వెనక్కు వెళ్లి 25 లో ఉన్నట్లుగానే అనిపిస్తుందని మరి కొందరు అంటున్నారు.