Begin typing your search above and press return to search.
అల్ట్రా రిచ్ లోదుస్తుల్లో అమెరికా కోడలు హల్చల్
By: Tupaki Desk | 21 Jun 2021 2:30 AM GMTప్రియాంక చోప్రా జోనాస్ ఎన్నో ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారకర్తగా కొనసాగుతున్నారు. తాజాగా గ్లోబల్ లోదుస్తుల బ్రాండ్ విక్టోరియా సీక్రెట్ బ్రాండ్ అంబాసిడర్ గా సలహాదారుగా ఎంపికయ్యారు. అవాస్తవ సౌందర్య ప్రమాణాలను నెలకొల్పి.. వాస్తవిక చిత్రణ వైపు పయనిస్తున్నందుకు తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్న ప్రఖ్యాత విక్టోరియా సీక్రెట్ ఏంజిల్స్ భారతదేశానికి దూరమవుతోంది. అందుకే దేశీ గాళ్ ప్రియాంకతో పాటు లోదుస్తుల బ్రాండ్ ఒప్పందం చేసుకుంది. యుఎస్ ప్రో సాకర్ ప్లేయర్ లింగ-సమానత్వ కార్యకర్త మేగాన్ రాపినో.. బ్రెజిలియన్ ట్రాన్స్ జెండర్ మోడల్ వాలెంటినా సంపాయో... ప్లస్-సైజ్ మోడల్ పలోమా ఎలెసర్ సుడానీస్-ఆస్ట్రేలియన్ మోడల్ అడుత్ అకేచ్.. ఫ్రీస్టైల్ స్కైయర్ ఎలీన్ గు, .. జర్నలిస్ట్ అమండా డి కాడెనెట్ తదితరులు ఈ బ్రాండ్ కి ప్రచారం చేస్తున్నారు.
ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు దేశ సంస్కృతిని బట్టి ప్రచారకర్తను ఎంపిక చేసామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ప్రపంచం మారుతుంటే దానికి తగ్గట్టు చేసిన మార్పు ఇది. పురుషులు ఏం కోరుకుంటున్నారో స్త్రీలు ఏమి కోరుకుంటున్నారో దానిని అందిస్తాం అని తెలిపారు.
ఏంజిల్స్ ప్రఖ్యాత వి.ఎస్ షోకు పర్యాయపదంగా ఉండేది. లోదుస్తుల బ్రాండ్ మొదట ఏంజిల్స్ తో 90 ల చివరలో గిసెల్ బుండ్చెన్- టైరా బ్యాంక్స్- హెడీ క్లమ్ వంటి మోడళ్ల ప్రచారంతో మొదలైంది. ఇటీవలి కాలంలో మోడళ్లతో సహా ఇరినా షేక్,.. జిగి హడిద్,.. కెండల్ జెన్నర్,.. బెల్లా హడిద్ ఈ ప్రదర్శనను 2018 వరకూ ప్రమోట్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ చేరువ కావడం మాకు చాలా కీలకం! ఒక వ్యవస్థాపక భాగస్వామిగా #TheVS కలెక్టివ్ వ్యాపారానికి సలహాదారుగా ఇది నేను చేయాలనుకుంటున్నాను అని పీసీ తాజాగా వెల్లడించారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బ్రాండ్లలో ఒకదానిలో అర్ధవంతమైన మార్పు తీసుకురావడంలో నా పాత్రపై సంతోషంగా ఉన్నాను. సమిష్టి కృషి తో ఇది సాధ్యం కావాలి అని అన్నారు. విక్టోరియా సీక్రెట్ వంటి హెరిటేజ్ బ్రాండ్ పరిణామం భవిష్యత్తు విజయాన్ని రూపొందించడంలో ఒక పాత్ర పోషించే అవకాశం నాకు ఉత్సాహం పెంచేది. క్రొత్త ప్రభావవంతమైన మార్గంలో ముందుకు సాగడానికి మేము కలిసి పనిచేస్తాం. ప్రజలందరినీ కలుపుకొని భవిష్యత్తులో డిజైన్లను అభివృద్ధి చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను అని అన్నారు.
1995 నుండి ప్రారంభమైన 10 సంవత్సరాల వ్యవధిలో నేను మొట్టమొదటి బ్లాక్ విక్టోరియాస్ సీక్రెట్ కాంట్రాక్ట్ మోడల్ టైరా బ్యాంక్స్. మొదటి బ్లాక్ విక్టోరియా సీక్రెట్ కవర్ మోడల్ గా అలరించారు.