Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: షార్ట్ ఫిలింకి ఎక్కువ...
By: Tupaki Desk | 17 April 2017 2:31 PMఇప్పుడు ఇతను లైన్ వేసిన అమ్మాయి అతనికి పడిపోవడం.. అతను లైన్ వేసిన అమ్మాయి ఇతనికి.. కన్ఫ్యూజన్ కామెడీ.. కామెడీలో ట్రాజెడీ.. ట్రాజెడీలో కామెడీ.. ఇలాంటి కథలు కథనాలు చాలానే చూశాం. ఇప్పుడు సరిగ్గా అలాంటి పాయింటే తీసుకుని దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ''ఆమి తూమి'' అంటూ మన ముందుకొచ్చాడు. అతి తక్కువ కాలంలో ఈ సినిమాను తీశాం అంంటున్నారు మేకర్లు. పదండి టీజర్ ఎలా ఉందో చూద్దాం.
అడివి శేష్.. అవసరాల శ్రీనివాస్.. వెన్నెల కిషోర్.. ఈషా ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా ఆద్యంతం కామెడీ కామెడీగా ఉండాలని ప్రయత్నించాడు ఇంద్రగంటి. కాకపోతే మనోడు ఈ మధ్యనే చాలా స్లిక్ థ్రిల్లర్ గా ''జెంటిల్మన్'' సినిమాను మలిచాడు కాబట్టి.. ఇప్పుడు ఆ రేంజు స్టయిలిష్ లుక్ లో ఏదన్నా ఎక్స్ పెక్ట్ చేసిన జనాలకు ఆమీ తూమీ కాస్త షాకే అని చెప్పాల్సిందే. దానికితోడు ఆన్-లొకేషన్ డబ్బింగ్ (సింక్ సౌండ్) కారణంగా.. వాయిస్ లో రీసౌండ్.. తద్వారా ఫీల్ కాస్త మారిపోయింది. ఒక లెక్కన చూస్తుంటే ఈ మధ్య కాలంలో వచ్చిన షార్ట్ ఫిలింలు.. వెబ్ సిరీస్ లు. చూస్తున్నట్లుందీ టీజర్. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంత ఇంప్రెసివ్ గా లేదు.
అయితేనేమీ.. ఈ మధ్యన ఇలాంటి రొటీన్ కామెడీలే తెగ నచ్చేస్తున్నాయి జనాలకు. ఒకవేళ ప్రాపర్ మసాలా అంతా సినిమాలో ఉంటే.. జనాలకు ఎక్కేసినా ఆశ్చర్యమేమీ లేదు. మరి సినిమా టీజర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు కాబట్టి.. ట్రైలర్ తో ఏమన్నా మ్యాజిక్ చేస్తారేమో చూద్దాం.