Begin typing your search above and press return to search.
నేను ఆరోగ్యంగానే ఉన్నా కరోనా లక్షణాలు లేవు : సానియా
By: Tupaki Desk | 19 March 2020 4:46 AM GMTభారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా తనకేమీ కరోనా లక్షణాలు లేవంటూ ప్రకటించింది. ప్రెంచ్ ఓపెన్ కోసం ఆదివారం కాలిఫోర్నియా చేరుకున్న సానియా మీర్జాకు అక్కడకు వెళ్లిన తర్వాత కరోనా కారణంగా ప్రెంచ్ ఓపెన్ వాయిదా వేసినట్లు గా మెసేజ్ అందిందట. అనవసరంగా 20 గంటలు జర్నీ చేశాము. నేను నాన్న ఆదివారం కాలిఫోర్నియాలో చేరుకున్నాం. చేరుకున్న గంటకే టోర్నీ వాయిదా వేస్తున్నట్లుగా మెయిల్ ద్వారా నాకు సమాచారం అందింది.
ఇలాంటి సమయంలో టోర్నీని వాయిదా వేయడం మంచి నిర్ణయమే అయినా కూడా క్రీడాకారులకు తెలియజేసి టోర్నీని వాయిదా వేయాల్సి ఉంది. క్రీడాకారులకు తెలియజేయకుండా కేవలం ట్విట్టర్ ద్వారా ప్రకటించి మెయిల్స్ చేయడం జరిగిందని సానియా అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసిన తర్వాత క్రీడాకారులు అంతా షాక్ లో ఉన్నారని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకొచ్చింది.
మే 24 నుండి జూన్ 7 వరకు కొనసాగాల్సిన ఈ టోర్నీని సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 4 వరకు నిర్వహించబోతున్నట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. అయితే యూఎస్ ఓపెన్ పూర్తి అయిన వారం రోజుల్లోనే ప్రెంచ్ ఓపెన్ తేదీని ఎలా నిర్ణయించారో అర్థం కాలేదంటూ సానియా అభ్యంతరం వ్యక్తం చేసింది. యూఎస్ ఓపెన్ కోసం హార్డ్ కోర్టుపై ఆడే క్రీడాకారులు ఆ వెంటనే మట్టి కోర్టులో ఎలా ఆడుతారంటూ సానియా ప్రశ్నించింది.
కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఆందోళనలో ఉన్న సమయంలో టోర్నీ వాయిదా వేయడం మంచిదే అన్న సానియా తిరిగి హైదరాబాద్ చేరుకున్నందుకు తన కొడుకు ఇజ్ హాన్ చాలా సంతోష పడుతున్నాడంది. అదృష్టవ శాత్తు నాకు నాన్నకు ఆ జర్నీ ద్వారా కరోనా వైరస్ సోకలేదంది. మా ఇద్దరికి కూడా కరోనా వైరస్ లక్షణాలు లేవంటూ క్లారిటీ ఇచ్చింది.