Begin typing your search above and press return to search.
డీలా పడిన అమిగోస్ వసూళ్లు.. 2 రోజుల్లో ఏంతంటే?
By: Tupaki Desk | 12 Feb 2023 12:19 PM GMTటాలీవుడ్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నా.. గత ఏడాదే వచ్చిన బింబిసారతో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు అమిగోస్ మూవీతో వచ్చాడు. ఈ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని దక్కించుకుంది. బింబిసారా వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. కానీ మొదటి రోజు ఆశించిన వసూళ్లు ఓపెనింగ్స్ మాత్రం రాలేదు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రంపచవ్యప్తంగా ఈ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా మొదటి రోజు రూ. 2.03 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.65 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలైంది. రెండు రోజుల్లో కేవలం మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా 3.92 కోట్ల షేర్, 6.85 కోట్ల గ్రాస్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ కలిపి తొలి రోజు 2. 03 కోట్లు, రెండో రోజు 1.11కోట్లు వచ్చాయి. మొత్తంగా 3.14 కోట్లు షేర్, 5.25 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయ్యాయి. రెండో రోజు నైజాంలో 38 లక్షలు, సి డెడ్ 15 లక్షలు, ఉత్తరాంధ్ర 14 లక్షలు, ఈస్ట్ 1 1 లక్షలు, గుంటూరు 10 లక్షలు, కృష్ణ 10 లక్షలు, నెల్లూరు 6 లక్షలు వచ్చాయి. మొత్తంగా ఏపీ తెలంగాణ కలిపి రెండో రోజు 1.11 కోట్ల షేర్, 1.75 కోట్ల గ్రాస్ వచ్చాయి.
ఇకపోతే ఈ చిత్రం ఓవరాల్ గా 11.30 కోట్ల బిజినెస్ చేసింది. అంటే దీని బ్రేక్ ఈవెన్ 12 కోట్లు. ఈ సినిమా గట్టెక్కాలంటే మరో 8.08 కోట్లు రావాల్సి ఉంటుంది.
అసలు ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందనే అంచనా తోనే భారీ రేట్స్ తో కోలుగోలు చేశారు. ఎందుకంటే బింబిసారా చిత్రానికి మొదటిరోజు దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కళ్యాణ్ రామ్ రేంజ్ కి అంత వసూళ్లు అంటే చాలా ఎక్కువ, అంతే కాదు ఆ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. అదే ఊపులో అమిగోస్ ఆడేస్తుందని బయ్యర్స్ కాస్త అశ పడ్డారు. కానీ అది జరగలేదు.
ఇక కళ్యాణ్ రామ్ నెక్స్ట్ చిత్రం బింబిసారా 2 ఈ ఏడాది లోనే షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది చూడాలి.