Begin typing your search above and press return to search.
టీజర్: ముగ్గురు కళ్యాణ్ రామ్ లు ఎలుకా పిల్లి ఆట?
By: Tupaki Desk | 8 Jan 2023 6:18 AM GMTటాలీవుడ్ లో హీరోగా నిర్మాతగా డ్యూయల్ రోల్ పోషిస్తూ కళ్యాణ్ రామ్ డే బై డే పరిణతి చెందుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా `పటాస్` తర్వాత అతడి నుంచి వరుస విజయాల్ని ఆశిస్తే అతడు మధ్యలో టపాసులు పేల్చాడు. అయితేనేం.. తనదైన మార్క్ వేసేందుకు అతడు ప్రతిసారీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
ఏదో ఒక రోజు ఆడియెన్ ని కుర్చీ అంచు మీద కూచోబెట్టి ఉక్కిరి బిక్కిరి చేయాలన్న పంతంతో ఉన్నాడు. ఆ పంతం పట్టుదల కసి అంతా ఇటీవల `బింబిసార`లో చూపించాడు. టైటిల్ కి తగ్గట్టే వైవిధ్యమైన కథాంశం పాత్రలతో కెరీర్ లో అదిరిపోయే హిట్ కొట్టాడు.
ఇప్పుడు అతడి నుంచి మరో ప్రయోగం దూసుకొస్తోంది. అమిగోస్ అనేది ఈ సినిమా టైటిల్. ఈసారి డాపెల్ గ్యాంజర్ గా అతడి ప్రయోగం ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లతో క్యూరియాసిటీ పెరిగింది. ఈ చిత్రంలో ముగ్గురు కళ్యాణ్ రామ్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారు. ఆ ముగ్గురూ విభిన్నమైన గెటప్పులతో ఒకరితో ఒకరు ఘర్షణ పడుతూ అలరించబోతున్నారు. సిద్ధార్థ్- మంజునాథ్ - మైఖేల్ పాత్రలను అతడు పోషించాడు. తాజాగా తన పాత్రల గురించి రివీల్ చేసే టీజర్ ని కూడా విడుదల చేశాడు కళ్యాణ్ రామ్. ఆ మూడు పాత్రలను పూర్తిగా ఆస్వాధిస్తారని.. కథను ఇష్టపడతారని నమ్మకాన్ని వ్యక్తం చేసారు.
తన సోదరుడు జూనియర్ జై లవకుశలో మూడు పాత్రల్లో అలరించారు. ఇప్పుడు ఎన్టీఆర్ లాగే కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజా టీజర్ చూడగానే అతడు తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ని ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది. మంజునాథ్- సిద్ధార్థ్ - మైఖేల్ (ఆజ్ఞాతవ్యక్తి) అనే మూడు పాత్రల్లో విభిన్నమైన ఆహార్యం ప్రదర్శించడంలో కళ్యాణ్ రామ్ సక్సెసయ్యాడు. ఆ ముగ్గురి మధ్యా ఎలుకా పిల్లి ఆట ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు డాపెల్ గాంజర్ లతో పోస్టర్ లు ఇప్పటికే క్యూరియాసిటీని పెంచగా టీజర్ తో అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయిని తాకాయి.
3 డోపెల్‌గాంజర్స్ #అమిగోస్ కథేంటో థియేటర్లలోనే చూడాలన్న ఉత్కంఠను టీజర్ పెంచింది. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలవుతోంది. ఇక టీజర్ లో అజ్ఞాతంలోని డోపెల్ గ్యాంజర్ రైఫిల్ పట్టుకుని ధడధడలాడిస్తున్న తీరు చూస్తుంటే ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని కూడా అర్థమవుతోంది. డు యు థింక్ `డాపల్ గాంగర్` ఈజ్ జోక్ అంటూ డైలాగులు కూడా అంతే డీసెంట్ గా ఉన్నాయి. ఇలాంటి ప్రయోగాలు అతడిని పాన్ ఇండియా స్టార్ ని చేసినా చేయొచ్చు. ఇలాంటి భారీ ఎక్స్ పెరిమెంట్లను ఆస్వాధించే పరిణతి ఇప్పుడు టాలీవుడ్ ఆడియెన్ కి ఉంది. నిరంతరం హాలీవుడ్ సినిమాల వీక్షణ పెరిగాక.. ఓటీటీల్లో వైవిధ్యమైన కంటెంట్ ని ఆస్వాధించాక ఏదో ఒక కొత్తదనం ఉంటే తప్ప జనం థియేటర్లకు రావడం లేదు. కళ్యాణ్ రామ్ టైమ్ చూసి టైంబాంబ్ లా దూసుకొస్తున్నాడు. అతడి ప్రయోగం ఫలిస్తుందా లేదా? అన్నది తేలాలంటే ఫిబ్రవరి 10కి ముందే ప్రివ్యూల వరకూ ఆగాల్సిందే.
ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని- రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ- దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి.