Begin typing your search above and press return to search.

ఉయ్యాలవాడపై అమీర్ ఆసక్తి

By:  Tupaki Desk   |   7 April 2019 2:30 PM GMT
ఉయ్యాలవాడపై అమీర్ ఆసక్తి
X
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా `సైరా నరసింహారెడ్డి` ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు నాటికి అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఇదివరకూ వార్తలొచ్చాయి. ఆ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి పై తీవ్ర ఒత్తిడి నెలకొందని ప్రచారమైంది. అయితే మెగాస్టార్ చిరంజీవి కొన్ని వారాల గ్యాప్ తీసుకుని జపాన్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి.. సురేఖ దంపతులు జపాన్ విజిట్ లో ఉన్నారు. ఆ ఇద్దరి విహారానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో పాటే ఈ టూర్ లో మెగాస్టార్ కి ఊహించని వేరొక స్వీట్ మూవ్ మెంట్ ఎదురైంది. బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్.. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ జపాన్ క్యోటో విమానాశ్రయంలో మెగాస్టార్ ని కలిశారు. ఈ సందర్భంగా అమీర్ ఎంతో ఎగ్జయిట్ అయ్యారు. చిరుని కలుసుకున్నప్పటి ఎగ్జయిట్ మెంట్ ని అమీర్ ఏమాత్రం దాచుకోలేదు.

``నా ఫేవరెట్ యాక్టర్లలో ఒకరైన సూపర్ స్టార్ చిరంజీవి గారి దగ్గరకు పరిగెత్తాను. క్యోటో విమానాశ్రయంలో తనని కలవడం ఎంతో ప్లెజెంట్ సర్ ప్రైజ్ నిచ్చింది. చిరంజీవి గారు నటిస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టు గురించి చర్చించాము. సర్.. మీరు అన్ని వేళలా ఎంతో స్ఫూర్తిని నింపుతారు`` అంటూ అమీర్ ఎంతో ఎగ్జయిట్ అయ్యారు. చిరు.. అమీర్ కలయికకు సంబంధించిన ఫోటోని అమీర్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది.

సైరా: నరసింహారెడ్డి చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. దానికి మెగాభిమానులు సహా బాలీవుడ్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అమీర్ ఖాన్ సైతం సైరా ప్రాజెక్టుపై ఆసక్తి కనబరచడం చూస్తుంటే ఈ సినిమాపై జాతీయ స్థాయిలో ఎన్ని కళ్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే సైరా చిత్రాన్ని 2019 మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సైరా పై ఆసక్తి కనబరచడం బాగానే ఉంది. అయితే మెగాస్టార్ తో కలిసి అతడు ఏదైనా మల్టీస్టారర్ లో నటిస్తే ఇంకా బావుంటుందని మెగాభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడున్న మల్టీస్టారర్ ట్రెండ్ లో అదేమంత కష్టం కాదు. అయితే అది ఎంత వేగంగా సాధ్యపడుతుంది అన్నదొక్కటే మ్యాటర్.