Begin typing your search above and press return to search.

ఐష్ కూతురు.. ఆమీర్ కొడుకు.. అలా

By:  Tupaki Desk   |   13 Aug 2016 5:30 PM GMT
ఐష్ కూతురు.. ఆమీర్ కొడుకు.. అలా
X
బాలీవుడ్ లో బర్త్ డే బాష్ లు బాగా కామన్. సెలబ్రిటీలు తమ పుట్టిన రోజులకే కాదు.. తమ రిలెటివ్స్.. తమ ఇంట్లోను దగ్గరి బంధువుల ఇంట్లో పిల్లల పుట్టిన రోజులను కూడా ఘనంగా సెలబ్రేట్ చేసేస్తుంటారు. పిల్లల పార్టీలకు.. మిగిలిన సెలబ్రిటీలు కూడా తమతమ పిల్లలతో వచ్చి సందడి చేస్తుంటారు. ఆగస్ట్ 12న విద్యాబాలన్ ఇలా తన మేనల్లుడు- మేనకోడలి బర్త్ డే పార్టీని. సబర్బన్ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు తన కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్ తో వచ్చింది.

సరిగ్గా కిరణ్ రావు వెళ్లిపోయే సమయానికి.. ఐశ్వర్యారాయ్ బచ్చన్ తన ముద్దుల కూతురు ఆరాధ్యతో కలిసి కారు దిగింది. ఇద్దరు పిల్లలు ఒకరినొకరు ఎదురుపడ్డంతో పలకరించుకున్నారు. గతంలోనే వీరికి పరిచయం ఉండడంతో పలకరింపులు ఓ రేంజ్ లో ఉన్నాయ్. ఎంచక్కా ఆరాధ్యను గట్టిగా కౌగిలించుకుని మరీ పలకరించాడు ఆజాద్. ఈ సీన్ చూసిన ఐశ్యర్య- కిరణ్ రావుల ఫీలింగ్స్ చూస్తే... అక్కడ నవ్వులు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధమవుతుంది.

చిన్న పిల్లల ప్రవర్తన ఎప్పుడూ నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది. ఇలా పిల్లల స్ట్రాంగ్ హగ్ ని చూసి నవ్వేసుకున్నాక.. కిరణ్ రావ్- ఐశ్యర్యా రాయ్ లు కూడా ఓ సారి హగ్ చేసుకుని పలకరించుకుని.. టాటా బైబై చెప్పేసుకున్నారు. కానీ ఈ పార్టీలో ఆజాద్- ఆరాధ్యల హగ్ టాపిక్ అయిపోయింది.