Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఫ్యాబ్ లుక్ అట్టబొమ్మ అదిరిందే!

By:  Tupaki Desk   |   17 April 2020 3:00 AM GMT
ఫోటో స్టోరీ: ఫ్యాబ్ లుక్ అట్టబొమ్మ అదిరిందే!
X
అమైరా దస్తూర్ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన 'రాజుగాడు'.. సందీప్ కిషన్ నటించిన 'మనసుకు నచ్చింది' లో హీరోయిన్ గా నటించింది. తెలుగు సినిమాలే కాకుండా హిందీ సినిమాల్లో నటిస్తూఉంటుంది. మామూలు ఫోటో షూట్లతో పాటుగా మ్యాగజైన్ ఫోటో షూట్లు చేయడం కూడా అమైరాకు అలవాటే.

తాజాగా ఈ భామ ఫ్యాబ్ లుక్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసింది. ఈ సంచికలో "అమైరా దస్తూర్ షైనింగ్ బ్రైట్" అనే టైటిల్ తో ఒక కథనం కూడాప్రచురించారు. ఫ్యాబ్ లుక్ ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజి ఫోటోను అమైరా తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలో నలుపు రంగుచీర.. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఓ సైడ్ కు తిరిగి పోజిచ్చింది. చెవులకు వేలాడే ఇయర్ రింగ్స్.. చేతి వేలికి ఉంగరం.. ఇలా ఆభరణాలు ధరించి సంప్రదాయ ఘాటు ఏంటో చూపించింది. ఇక సన్నని నడుము అందాలు ఈ ఫోటోలో హైలైట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇలాంటి ఫోటోలకు ఇన్స్టా లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే తెగ లైక్స్ కొట్టారు. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు. "కిల్లర్ శారీ" . "ఫ్యాబ్ లుక్ ఆన్ ఫైర్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. సినిమాల విషయానికి వస్తే అమైరా ప్రస్తుతం తమిళంలో 'ఊడి ఊడి ఉళైకాణమ్' . 'కాదలై తేడి నిత్యా నందా' సినిమాల్లో నటిస్తోంది. హిందీలో 'పిల్ఫర్ సింగ్' అనే సినిమాలో నటిస్తోంది.