Begin typing your search above and press return to search.

లేటు వ‌య‌సులో ఆర‌బోస్తున్న అమీషా

By:  Tupaki Desk   |   2 Feb 2022 12:30 PM GMT
లేటు వ‌య‌సులో ఆర‌బోస్తున్న అమీషా
X
లేటు వ‌య‌సులో ఘాటు అందాల‌తో చెల‌రేగుతోంది అమీషా ప‌టేల్. యాభై కు చేరువ‌లో ఉన్నా ఈ భామ‌లో మిస‌మిస‌ల‌కు కొద‌వేమీ లేదని వ‌రుస ఫోటోషూట్లు ప్రూవ్ చేస్తున్నాయి. 47ఏళ్ల ఈ బ్యూటీ ఇప్ప‌టికీ ఇంకా బాలీవుడ్ లో న‌టించేందుకు త‌హ‌త‌హ‌లాడుతోంది. అయితే నేటి జ‌న‌రేష‌న్ తో పోటీలో నిల‌వలేక‌పోయిన ఈ బ్యూటీ ఇత‌ర భాష‌ల‌పైనా దృష్టి సారించింది. తాజాగా అమీషా ట్విట్ట‌ర్ లో షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. రెడ్ అండ్ బ్లూ ప‌ర్పుల్ బికినీలో అమీషా ఫోజులు యూత్ లోకి దూసుకెళుతున్నాయి.

అమీషా తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌- మ‌హేష్- బాల‌కృష్ణ‌ లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే. `బ‌ద్రి`.. `నాని`..`న‌ర‌సింహుడు`..`ప‌ర‌మ‌వీర చ‌క్ర‌` లాంటి చిత్రాల్లో న‌టించింది. కానీ ఆ త‌ర్వాత ఇక్కడ అవ‌కాశాలు రాలేదు. బాలీవుడ్ లోనూ కెరీర్ ప‌రంగా బ్రేకులు ప‌డుతూనే ఉండ‌డం పెద్ద మైన‌స్ గా మారింది. గ‌త మూడేళ్లుగా పూర్తిగా సినిమాల‌కు దూర‌మైంది. కానీ ఈసారి మాత్రం ఏకంగా నాలుగైదు సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డినా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ల‌తో అమీషా జోష్ ప్ర‌ద‌ర్శించ‌నుంది. `దేశీ మ్యాజిక్`..`టూబా తేరా జ్వాలా`..`ది గ్రేట్ ఇండియ‌న్ కాసినో` చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉండ‌గా..`మిస్ట‌రీ ఆఫ్ టాటూ`..`గ‌ద‌ర్ -2` చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.

క‌రీనాతో గొడ‌వేంటి?

అమీషా పటేల్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో సీనియ‌ర్ నాయిక‌ కరీనా కపూర్ తో తన దశాబ్దాల వైరం గురించి ఎట్టకేలకు ఓపెనైంది. నాకు ఆమెకు మ‌ధ్య‌ వ్యతిరేకంగా ఏమీ లేదు.. అని క్లారిటీనిచ్చింది. 2000లో `కహో నా...ప్యార్ హై` చిత్రం విడుదలైనప్పుడు ఇద్దరు నటీమణుల మధ్య రిలేష‌న్ సరిగ్గా లేవని క‌థ‌నాలొచ్చాయి. వాటి ప్రకారం.. బెబో అమీషాను `బ్యాడ్ యాక్ట‌ర్‌` అని కామెంట్ చేసింద‌ని.. `కహో నా... ప్యార్ హై` చిత్రంలో ఆమె పాత్రపై అనేక అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. అప్పటి నుంచి కరీనా.. అమీషా ఇద్దరి మ‌ధ్యా విభేదాలు త‌లెత్తాయి.

అయితే ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..అమీషా దీనిని ఖండించింది. మా మ‌ధ్య ఎప్పుడూ లేని విషయాలను అనవసరంగా కుక్ చేస్తున్నార‌ని చెప్పారు. కరీనా చాలా అందమైన స్త్రీ.. అద్భుతమైన నటి! అంటూ డిప్ల‌మాటిగ్గా ఆన్స‌ర్ ఇచ్చింది అమీషా. త‌నతో ఎలాంటి విభేధాలు లేవ‌ని కూడా తెలిపింది.