Begin typing your search above and press return to search.

'సైరా'కు వచ్చిన సమస్యే మెగా 152కి కూడా..!

By:  Tupaki Desk   |   21 Oct 2019 1:42 PM GMT
సైరాకు వచ్చిన సమస్యే మెగా 152కి కూడా..!
X
చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు అంతా సవ్యంగా సాగింది. కాని సంగీత దర్శకుడి విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొదట ఈ సినిమా కోసం ఏఆర్‌ రహమాన్‌ ను అనుకున్నారు. సినిమా ఆలస్యం అయిన కారణంగా డేట్లు కుదరక పోవడంతో ఆయన సినిమా నుండి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో బాలీవుడ్‌ కంపోజర్‌ అమిత్‌ త్రివేది సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అమిత్‌ త్రివేది పాటలకు సంగీతాన్ని అందించగా జూలియస్‌ ప్యాకియం బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు.

సైరా సంగీత దర్శకుల విషయంలో చివరి వరకు కూడా గందరగోళం నడిచింది. ఇప్పుడు అదే పరిస్థితి చిరంజీవి 152వ చిత్రానికి కూడా కొనసాగేలా అనిపిస్తుంది. కొరటాల ప్రతి సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తాడు. కాని ఈసారి మాత్రం దేవిశ్రీని మార్చాలని కొరటాల శివ భావిస్తున్నాడట. దేవిశ్రీ కాకుండా బాలీవుడ్‌ స్టార్‌ కంపోజర్స్‌ అజయ్‌.. అతుల్‌ లను తీసుకోవాలని భావిస్తున్నాడట.

కొరటాల నిర్ణయాన్ని మెగా ఫ్యాన్స్‌ సమర్ధించే అవకాశం లేదని.. సైరాకు బాలీవుడ్‌ కంపోజర్స్‌ అవ్వడం వల్ల తెలుగుదనం తగ్గిందని ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌ కంపోజర్స్‌ అవ్వడం వల్ల సినిమాపై జనాల్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల నిర్ణయంను చిరంజీవి మరియు చరణ్‌ లు సమర్ధిస్తారా అనే చర్చ కూడా మొదలైంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న మెగా 152 చిత్రం వచ్చే నెల నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ కు వెళ్లబోతుంది. ఈ సినిమా నేపథ్యం గురించి రకరకాలుగా ప్రచారాలు సాగుతున్నాయి.

హీరోయిన్స్‌ విషయంలో కూడా అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. కాని ఇప్పటి వరకు ఏ విషయాన్ని కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు. మెగా 152కు సంబంధించి దర్శకుడు కొరటాల శివ మరియు నిర్మాతలు రామ్‌ చరణ్‌ ఇంకా నిరంజన్‌ రెడ్డి అనే విషయాలు మాత్రమే అధికారికంగా వచ్చాయి. ఇక మెగా 152 గురించి వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది చూడాలి.