Begin typing your search above and press return to search.
సైరా తో థ్రిల్లింగ్ ఎంట్రీ ఇచ్చిన త్రివేది!
By: Tupaki Desk | 22 Aug 2018 7:19 AM GMTమెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా 'సైరా' టీజర్ నిన్నే రిలీజ్ అయింది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో సినిమా టీజర్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అందరి అంచనాలు అందుకోవడమే కాదు.. 'సైరా' టీజర్ సినిమాపై ఆసక్తి మరింత పెరిగేలా చేసింది. ముఖ్యంగా చిరు గెటప్ అయితే అదిరిపోయింది.
అందరినీ ఆకర్షించడం - ఆకట్టుకోవడం మెగాస్టార్ కు సాధారణమైన విషయమే కాబట్టి మనం ప్రత్యేకంగా దాన్ని చూడాల్సిన పనిలేదు. చిరు సంగతి పక్కన బెడితే ఈ టీజర్ లో అందరిని థ్రిల్ చేసిన అంశం నేపథ్య సంగీతం. బాలీవుడ్ మ్యూజిక్ కంపొజర్ అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందంతే! అమిత్ కు టాలీవుడ్ లో ఇది మొదటి సినిమా. బాలీవుడ్ లో దాదాపు యాభై సినిమాలు చేసిన అమిత్ 'సైరా' టీజర్ మ్యూజిక్ తో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు.
ఈ సినిమాకు మొదట సంగీత దర్శకుడిగా AR రెహమాన్ ను ఎంచుకున్న విషయం తెలిసిందే. కానీ అయన తప్పుకోవడంతో ఈ హిస్టారికల్ ప్రాజెక్ట్ కు ఎవరిని ఎంపిక చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సాధారణ కమర్షియల్ చిత్రాలకు సంగీతం అందించడం వేరు.. ఇలాంటి పీరియడ్ సినిమాలకు సంగీతం అందించడం వేరు. అందుకే సురేందర్ రెడ్డి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ ను ఎంపిక చేసుకున్నాడు.
సూపర్ హిట్ మూవీస్ తో పాటుగా పలు ఎక్స్ పరిమెంటల్ సినిమాలకు సంగీతం అందించిన అనుభవం అమిత్ సొంతం. 'సైరా' టీం లోకి ఈమధ్యే వచ్చినా టీజర్ కు సూపర్ క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చి టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆడియోపై కూడా అంచనాలు పెరిగాయి. ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ను సెలక్ట్ చేసుకున్నందుకు డైరెక్టర్ సురేందర్ రెడ్డి ని కూడా అందరూ అభినందిస్తున్నారు. మరో వైపు ఈ అమిత్ ప్రభాస్ - రాధాకృష్ణ సినిమాకు కూడా సంగీతం అందిస్తాడట.