Begin typing your search above and press return to search.
ప్రభాస్ సినిమా మీద 'సైరా' ఎఫెక్ట్ ?
By: Tupaki Desk | 9 Nov 2019 2:30 PM GMTప్రస్తుతం టాలీవుడ్ లో ఇతర భాషల సంగీత దర్శకులకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు మేకర్స్. లేటెస్ట్ గా 'సాహో' ,' సైరా' లాంటి బడా సినిమాలకు కూడా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ నే నమ్ముకున్నారు. అయితే 'సాహో' కి సంబంధించి శంకర్ ఎసన్ లాయ్ మధ్యలోనే సినిమాను వదిలేసి మేకర్స్ కి షాక్ ఇచ్చారు. అయితే అమిత్ త్రివేది మాత్రం 'సైరా' పూర్తయ్యే వరకూ పని చేసాడు.
నిజానికి 'సైరా' విషయంలో నేపథ్య సంగీతం పై బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. సినిమాలో ఉన్న అడపాదడపా ఎలివేట్ అయిన సన్నివేశాలకు అమిత్ నుండి అదిరిపోయే నేపథ్య సంగీతం పడలేదంటూ మెగా ఫ్యాన్స్ కూడా చెప్పుకున్నారు. ఇక పాటల్లో కూడా టైటిల్ సాంగ్ ఒక్కటే క్లిక్ అయింది. సినిమా ప్రారంభంలో వచ్చే జాతర సాంగ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.
అయితే ఇప్పుడు 'సైరా' మ్యూజిక్ ఎఫెక్ట్ ప్రభాస్ 'జాన్' మీద పడింది. దీనికి కారణం ఈ సినిమాకు కూడా అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండటం. అయితే మెగా స్టార్ సినిమాకు మంచి నేపథ్య సంగీత ఇవ్వలేకపోయిన అమిత్ కనీసం ప్రభాస్ సినిమాకైనా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తాడా అంటూ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. నిజానికి ఏ సినిమాకైనా నేపథ్య సంగీతం అనేది కీలకం. అసలే ప్రభాస్ జాన్ పీరియాడిక్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోంది. మరి ఆ లవ్ ఫీల్ క్యారీ చేసేలా మ్యూజిక్ పడాలి ముఖ్యంగా పాటలు మెస్మరైజ్ చేయాలి. అప్పుడే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. మరి ఈ బాలీవుడ్ డైరెక్టర్ ఈసారైనా తన మ్యూజిక్ తో సత్తా చాటతాడా ? చూడాలి.