Begin typing your search above and press return to search.
గుమ్మడికాయ దొంగలా దొరికిపోయిన స్మాల్ బచ్చన్
By: Tupaki Desk | 29 April 2022 4:05 AM GMTసౌత్ నుంచి వెళ్లి హిందీలో సంచలన విజయాలు సాధిస్తున్న పాన్ ఇండియా సినిమాలను అక్కడి ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ లో ఒక సెక్షన్ మీడియా .. ఖాన్ ల త్రయం ఇతర అగ్ర హీరోలు సౌత్ గొప్పతనాన్ని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు. అందుకు వారికి మనసు రావడం లేదనడానికి ఇటీవల పలువురి కామెంట్లే ఇందుకు నిదర్శనం.
బాహుబలి- సాహో- RRR- పుష్ప - KGF 2 దక్షిణ భారత ప్రాంతీయ చిత్రాలు హిందీ బాక్సాఫీస్ ని గడగడలాడించాయి. సాహో మినహా ఇతర చిత్రాలన్నీ దేశవ్యాప్త విజయంతో సంచలనాలుగా మారాయి. 1000 కోట్ల క్లబ్ అంటే సౌత్ సినిమాకి ఏమంత కష్టం కాదని నిరూపించాయి. ఇది నిజంగా అసాధారణ ఫీట్ అన్న చర్చ జాతీయ స్థాయిలో సాగుతోంది. ప్రస్తుత తరంలో పాన్-ఇండియా విజయాలు సాధించగల సామర్థ్యం సౌత్ ఫిల్మ్ మేకర్స్ కి మాత్రమే ఉందని నార్త్ వాళ్లకు అంత సీన్ కనిపించడం లేదని కూడా గుసగుస వేడెక్కించేస్తోంది.
అయితే దీనిని అంగీకరించేందుకు బాలీవుడ్ ప్రముఖులు సిద్ధంగా లేరు. ఇంతకుముందు జాన్ అబ్రహాం.. అక్షయ్ కుమార్ .. అజయ్ దేవగన్ వంటి ప్రముఖ హీరోలు మీడియా ప్రశ్నలకు నీళ్లు నమిలారు. ఇప్పుడు అదే దారిలో లెజెండ్ అమితాబ్ బచ్చన్ వారసుడు దొరికిపోయాడు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ పాన్-ఇండియా ఫిల్మ్ అనే పదాన్ని నమ్మే మానసిక స్థితిలో లేడు. ఒక ప్రముఖ పోర్టల్ కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ ప్రస్తుత పరిస్థితి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు 'అద్భుతమైన కాలం' అంటూ సరిపుచ్చే ప్రయత్నం చేశాడు. తన మాటల్లో సౌత్ అనే పదాన్ని పలకకుండా జాగ్రత్త పడ్డాడు.
పాన్-ఇండియా అప్పీల్ కోణంలో సినిమాలను వర్గీకరించడానికి తానెప్పుడూ సిద్ధంగా లేనని స్మాల్ బి తనకు ఎదురైన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాడు. అతని వివరణ ఇంకా ఇలా ఉంది. మంచి సినిమా పని చేస్తుంది. చెడ్డ చిత్రం పనిచేయదు. ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం... అంటూ కవరింగ్ కహానీ చెప్పాడు. ఇటీవలి దక్షిణ భారత చిత్రాల విజయాల గురించి ప్రశ్నించగా.. అభిషేక్ మాట్లాడుతూ సూర్యవంశీ - గంగూబాయి కతియావాడి వంటి బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చాలా మంచి వసూళ్లు రాబట్టాయి.. అంటూ తన బింకాన్ని ప్రదర్శించాడు. బాలీవుడ్ తో పోటీపడుతూ సౌత్ సాధిస్తున్న పాన్ ఇండియా విజయాలను అతడు జీర్ణించుకోలేకపోయాడని ఈ సమాధానం ప్రూఫ్ గా నిలుస్తోంది.
లార్జర్ దేన్ లైఫ్ కథలతో హీరో-సెంట్రిక్ చిత్రాల విజయాల గురించి బచ్చన్ మాట్లాడుతూ.. ఒక నిర్దిష్టమైన సినిమా పునరాగమనం ఇది అని తాను పిలవగలనా లేదా అనేది తనకు క్లారిటీగా తెలియదని చెప్పాడు. ఈ సినిమాలు మంచి వసూళ్లు సాధించడం.. థియేటర్లు హౌస్ ఫుల్ కావడం ఆనందంగా ఉందని పైపై లేపనం పూసే ప్రయత్నం చేశాడు.
అయితే అభిషేక్ బచ్చన్ వివరణ వందశాతం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలు బాలీవుడ్ కి ఇప్పుడు కొత్తేమీ కాదు.. ఇంతకుముందు క్రిష్ ఫ్రాంఛైజీ కానీ.. ధూమ్ సిరీస్ కానీ ఈ తరహానే.. కానీ వాటిని మించి సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలుగా మారాయి. రొమ్ములు విరుచుకుని మేమే దేశంలో పెద్ద హీరోలం అని చెప్పుకునే వాళ్లందరికీ చెక్ పడిపోతోంది. దీనిని దాచేసేందుకు జాన్ అబ్రహాం.. అజయ్ దేవగన్.. స్మాల్ బి వంటి వారు.. ఖాన్ ల త్రయం కూడా నానా తంటాలు పడుతున్నారు. అభిషేక్ చివరిసారిగా నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదలైన దస్వి చిత్రంలో కనిపించాడు. అతడి చిత్రాలకు ఉండే ఆదరణ ఎంతో అందరికీ తెలిసినదే. గుమ్మడికాయ దొంగ ఎవరు? అంటే ప్రముఖ బాలీవుడ్ హీరోలంతా భుజాలు తడుముకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజమైన భారతీయ సినిమా అంటే సౌత్ సినిమా మాత్రమే అనే రేంజు కాంపిటీషన్ మొదలైంది. ఇక ముసలాళ్లు (ఏజ్ బార్ 50 ప్లస్ ఖాన్ లు ఇతరుల) అయిపోయిన హిందీ హీరోలకు ఇది నిజంగా మింగుడు పడని పరాభవం లాగా కనిపిస్తోంది. అయినా మంచి సినిమానే ఆడుతుంది.. చెడ్డ సినిమా ఆడదు.. అన్నది ఎవరికి తెలియని సూత్రం స్మాల్ బి గారూ?