Begin typing your search above and press return to search.
బాత్రూమ్..టాయిలెట్ క్లీనింగ్ ని ఎంజాయ్ చేస్తున్నా! అమితాబ్
By: Tupaki Desk | 29 Aug 2022 5:37 AM GMTబిగ్ బీ అమితాబచ్చన్ రెండవసారి మళ్లీ కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన చికిత్స విషయంలో ఎంతలా శ్రద్ద తీసుకుంటున్నారో? చుట్టు పక్కల పరిసరాల శుభ్రత విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐసోలేషన్ ఉండటంతో తన రూమ్ ని తానే క్లీన్ చేసుకుంటున్నారు.
అంతే కాదు బాత్రూమ్..టాయిలెట్ గతో పాటు ప్లోర్ ని సైతం బిగ్ బీ స్వయంగా తానే శుభ్రం చేసుకుంటున్నారు. జీవితం ఇలాంటి రోజుల్ని కూడా తీసుకొస్తుందని ఇప్పుడే అర్ధమైందన్నారు. అయితే ఆ పనుల్ని ఎంతో ఆస్వాదిస్తూ చేస్తున్నట్లు అమితాబ్ చెప్పుకొచ్చారు.
కరోనా రాకతో మనిషికి మనిషే శత్రువైన సంగతి తెలిసిందే. వైరస్ లోడ్ ఇప్పుడంత ప్రభావంతంగా లేనప్పటికి ఇలాంటి వైరస్ లు వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందన్నది కోవిడ్ ఇప్పటికే రుజువు చేసింది.
వేల..వందల కోట్ల అధిపతి సైతం కోవిడ్ పీక్స్ లో ఉన్నప్పుడు తన పని తానే చేసుకోవాల్సి వచ్చింది. వైరస్ సోకకపోయినా భయాందోళనతో పని వాళ్లు ఇళ్లకు వెళ్లడం మానేసారు. దీంతో ఎవరి వంటలు వాళ్లే రెడీ చేసుకున్నారు. ఎవరి కంచం వారే కడుక్కున్నారు.
ఎవరి ఇళ్లు వాళ్లే ఊడ్చుకున్నారు. ఇవన్నీ కోవిడ్ నేర్పిన పాఠాలు. ఎంత డబ్బు ఉన్నా? ఇలాంటి వైరస్ లు ముందు దిగ దుడుపే అని రుజువైంది. డబ్బుంటే అన్ని దొరుకుతాయి అని భ్రమపడేవారికి కోవిడ్ నిజంగా ఓ గుణపాఠం నేర్పిందనొచ్చు.
కాగా బిగ్‌బీ ప్రస్తుతం బుల్లితెర క్విజ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 14వ సీజన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ సందర్భంగా ఆయన పలువురిని కలుస్తున్నారు. కాగా కరోనా ఆంక్షలు.. నిబంధనల నేపథ్యంలో గత రెండేళ్లుగా కేబీసీ షూటింగ్ ప్రేక్షకులు లేకుండానే జరిగింది. అయితే ఈ ఏడాది మాత్రం మళ్లీ పాత పద్ధతిలోనే షోను నిర్వహిస్తున్నారు. అయితే బచ్చన్‌కు కరోనా ఎలా వచ్చిందనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. Abuse వద్దు.