Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కాస్ట్ లీ గ్యారేజ్

By:  Tupaki Desk   |   17 Jan 2018 8:30 AM GMT
మెగాస్టార్ కాస్ట్ లీ గ్యారేజ్
X
ఎంత బాలీవుడ్ మెగాస్టార్ అయినా - బిగ్ బి అంటూ అభిమానులంతా ముద్దుగా పిలుచుకునే రేంజ్ కి ఎదిగినా అమితాబ్ బచ్చన్ కు కూడా ఒక సరదా ఉందండోయ్ . అదే ఖరీదైన కార్ల కలెక్షన్. కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్ళలో నీ హైటుకి సినిమా హీరో అవుతావా అని ఎగతాళి పొందటం మొదలుకొని కూలి సినిమాలో తనకు నిజంగా యాక్సిడెంట్ అయితే దేశవ్యాప్తంగా ప్రజల చేత పూజలు - ప్రార్థనలు చేయించుకునే స్థాయికి చేరటం అంటే మాటలు కాదు.

సినిమా తారలైనా సాధారణంగా కొత్త కారు కొనాలి అనుకున్నప్పుడు పాతది అమ్మడమో లేక ఎక్స్ చేంజ్ లో మంచి ధర వచ్చేలా చూసుకోవడమో చేస్తారు. కాని ఈ విషయంలో బిగ్ బి స్టైల్ వేరు. తన మనసుకు నచ్చిన ఏ కారును ఎవరికైనా ఇవ్వడమో లేక అమ్మడమో ఆయన చేయరు. తన దగ్గరే అట్టిపెట్టుకుంటారు. అలా కలెక్షన్ లో చేరిన కార్లతో ఏకంగా ఒక గ్యారేజ్ ని తలపించే షో రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.

తన కెరీర్ లో బిగ్ బి కొన్న మొదటి కారు సెకండ్ హ్యాండ్ ఫియట్. అప్పటికి ఆయన ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదుట పడలేదు. స్లోగా సెటిల్ అయ్యే క్రమంలో ఉన్నారు. ఇక హిట్ తర్వాత హిట్ కొట్టేసి షోలే నుంచి ఇక ఏ రేంజ్ కు వెళ్ళారో చెప్పుకుంటూ పోతే ఒక చరిత్రే అవుతుంది. ఇక అమితాబ్ ఇంటి ముందు బారులా కనిపించే కార్ల వరుస చూస్తే ఇంటికి ఎవరైనా ప్రముఖులు వచ్చారేమో అనుకునేలా ఉంటుంది కాని నిజానికి అమితాబ్ ఫ్యామిలీ మాత్రమే అందులో ఉంటుంది. ఓసారి ఆ కార్ల లెక్కలు ఏంటో చూద్దామా

బెంట్లే ఆర్నేజ్‌ ఆర్‌ (ధర: రూ.2.7 కోట్లు)

బెంట్లే కాంటినెంటల్‌ జీటీ (ధర: రూ.3.5- రూ.5 కోట్లు)

పోర్షె కెమ్యాన్‌ ఎస్‌ (ధర: రూ.1 కోటి- రూ.1.3 కోట్లు)

రేంజ్‌ రోవర్‌ (ధర: రూ1.45-రూ1.55 లక్షలు)

మినీ కూపర్‌ (ధర: రూ.30- రూ.35 లక్షలు)

రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ (ధర: రూ.4.70- రూ.9.7 కోట్లు)

లాంబోర్గిని ముర్సిలాగో (ధర: రూ.3.8-4 కోట్లు)

మెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌320 (ధర: రూ.1.2-9.3 కోట్లు)

కేవలం ఇక్కడ ఖరీదైన వాటిని మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఇంకా చిన్నా చితక కార్లు వేరే ఉన్నాయట. ఒక కారును మైంటైన్ చేయటమే తలకు మించిన భారంగా ఫీల్ అయ్యే పరిస్థితుల్లో ఇలా ఇన్నేసి కార్లు ఇంత జాగ్రత్తగా చూసుకోవడం అంటే కార్ కలెక్షన్ లో కూడా బిగ్ బి అనిపించారు కదా.