Begin typing your search above and press return to search.
వైరల్ అవుతున్న అమితాబ్ - జయ - లండన్!
By: Tupaki Desk | 3 Jun 2020 9:10 AM GMTఇండియన్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నేడు తన 47వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1973 జూన్ 3వ తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అమితాబ్, జయ బచ్చన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నేటితో వీరి దాంపత్య జీవితం సరిగ్గా 46 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయం బిగ్ బి పెళ్లినాటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే తన హీరోయిన్ జయ బచ్చన్‌ను ఎలా వివాహం చేసుకున్నారో.. అంతేగాక వీరి పెళ్లికి కీలకమైన లండన్ పర్యటన గురించి ట్విటర్‌లో వివరించారు.
‘జూన్ 3, 1973.. 47 సంవత్సరాల క్రితం సరిగ్గా ఈ రోజు.. 'జంజీర్' సినిమా భారీ విజయం సాధించడంతో వేడుకలు చేసుకునేందుకు జయ మరియు కొద్దిమంది స్నేహితులతో లండన్ వెళ్లి పార్టీ చేసుకోవాలని అనుకున్నాం. ఈ విషయాన్ని ముందుగా నాన్న హరివంశ్‌రాయ్ బచ్చన్‌కు చెప్పాను. ఎవరితో వెళుతున్నావని ఆయన అడిగారు. జయతో అని చెప్పినప్పడు.. నువ్వు ముందు ఆమెను పెళ్లి చేసుకో ఆ తరువాత లండన్ వెళ్లండి. లేకపోతే వెళ్లకండి అన్నారు. దానిని నేను అంగీకరించాను. జూన్3, 1973న కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో జయను వివాహం చేసుకున్నాను. అనంతరం ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి లండన్‌కు బయలుదేరాం’ అంటూ పెళ్లి నాటి జ్ఙాపకాలను గుర్తు చేసుకున్నారు బిగ్ బి.
అయితే అమితాబ్ బచ్చన్, జయ ఫస్ట్ 1972లో విడుదల అయిన ‘బన్సీ బిర్జు’లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత అభిమాన్, ఏక్ నజర్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. బిగ్‌బీ, జయకు ఇద్దరు సతానం అభిషేక్, శ్వేతా బచ్చన్. అభిషేక్ బచ్చన్.. హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ను 2007లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. శ్వేతా బచ్చన్ పారిశ్రామికవేత్త నిఖిల్ నందను వివాహం చేసుకున్నారు. వీరికి నవ్య నవేలి, అగస్త్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా అమితాబ్-జయల పెళ్లి రోజు శుభాకాంక్షలతో హోరెత్తుతుంది. సెలబ్రిటీలు.. అభిమానులు.. విష్ చేస్తూనే.. మీ జంట ఎందరికో ఆదర్శం అంటూ కొనియాడారు.