Begin typing your search above and press return to search.

టికెట్ రేటు త‌గ్గ‌క‌పోతే భ‌విష్య‌త్ లేదు!

By:  Tupaki Desk   |   4 Oct 2022 2:30 AM GMT
టికెట్ రేటు త‌గ్గ‌క‌పోతే భ‌విష్య‌త్ లేదు!
X
కుటుంబ స‌మేతంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చూసే రోజులు పోయాయి. అధికాదాయ వ‌ర్గాల‌కు ఉన్న స్వేచ్ఛ మ‌ధ్య త‌ర‌గ‌తికి లేదు. ఐదుగురు కుటుంబ స‌భ్యులున్న ఒక చిన్న మ‌ధ్య త‌ర‌గతి కుటుంబం ఒక్కో సినిమాకి సుమారు రూ.5000 ఖ‌ర్చు చేయాల్సిన స‌న్నివేశం ఉంది. దీంతో థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు మిడిల్ క్లాస్ లోవ‌ర్ క్లాస్ ఫ్యామిలీస్ వెన‌కాడుతున్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.

కాస్త ఆల‌స్యంగా అయినా కానీ బాలీవుడ్ ప్ర‌ముఖులు దీనిని గ్ర‌హించారు. నెమ్మ‌దిగా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు అంశం పైనా దృష్టి సారిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో టికెట్ ధ‌ర‌ను ఉంచితే దాని ఫ‌లితం ఎలా ఉంటుందో ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డుతోంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ - రష్మిక మందన్న నటించిన గుడ్ బై చిత్రం టికెట్ ధ‌ర‌ను త‌గ్గించారు. జాతీయ సినిమా దినోత్సవం తర్వాత డే వ‌న్ లో త‌గ్గిన ధర విధానాన్ని అనుసరించిన మొదటి చిత్రమిది. ఏక్తా కపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ గుడ్ కోతో కలిసి సినీ ప్రేమికుల కోసం ఒక ప్రత్యేక ప్రకటన విడుద‌ల చేసింది. అమితాబ్ బచ్చన్ - రష్మిక మందన్న నటించిన గుడ్ బై విడుదల రోజు అంటే అక్టోబర్ 7 న ఒక్కో టిక్కెట్టుకు రూ.150. చెల్లించి కొనుక్కోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది.

లెజెండరీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ప్రత్యేక వీడియో ద్వారా త‌గ్గింపు ధరల గురించి ప్ర‌క‌టించారు. గుడ్ బై మూవీని థియేటర్ల‌లో చూడమని ప్రోత్సహించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ ట్విట్టర్ లో అమితాబ్ బచ్చన్ వీడియో ని షేర్ చేసారు.

గుడ్ బాయ్ అనేది ప్రేక్షకుల హృదయాలకు నేరుగా కనెక్ట్ అయ్యే ఒక అందమైన హృద్య‌మైన‌ నాటకం. ప్రేమ‌ దుఃఖం సెంటిమెంట్ నేప‌థ్యంలో హృదయాన్ని కదిలించే ప్రయాణాన్ని తెర‌పై చూడాల‌ని అమితాబ్ కోరారు. వికాస్ బహ్ల్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నీనా గుప్తాతో పాటు సునీల్ గ్రోవర్- పావైల్ గులాటి- ఆశిష్ విద్యార్థి- ఎల్లి అవ్రామ్- సాహిల్ మెహతా - శివిన్ నారంగ్ సహాయక పాత్రల్లో నటించారు.

గుడ్ కోతో కలిసి ఏక్తా ఆర్ కపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ నిర్మించిన గుడ్ బై అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. త‌గ్గింపు ధ‌ర‌ల‌తో సినిమా చూసిన వాళ్లంతా మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తే సినిమా విజ‌యం సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. కంటెంట్ తో మెప్పిస్తే చాలు ... జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు రప్పించడం క‌ష్ట‌మేమీ కాదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.