Begin typing your search above and press return to search.
అల్లరోడు హీరో అవడం వెనుక అమితాబ్
By: Tupaki Desk | 21 July 2016 5:30 PM GMTఈవీవీ సత్యనారాయణ తన పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ ను హీరోను చేయాలనుకున్నారు. చిన్న కొడుకు నరేష్ ను దర్శకుడిగా చూడాలనుకున్నారు. అందుకే ఆర్యన్ ను స్వయంగా హీరోగా పరిచయం చేశాడు కానీ.. నరేష్ ను పట్టించుకోలేదు. ఐతే నరేష్ కు మాత్రం చిన్నప్పట్నుంచి హీరో అవ్వాలని ఉండేదట. కానీ తన తండ్రికి ఇష్టం లేకపోవడంతో తన కోరికను అణచుకున్నాడట. కానీ అమితాబ్ బచ్చన్ పుణ్యమా అని తాను హీరో అయ్యానని అంటున్నాడు నరేష్. మరి అల్లరోడు హీరో కావడానికి.. అమితాబ్ బచ్చన్ కు ఏం సంబంధమో తన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘నేను హీరో కావాలా.. దర్శకుడు కావాలా అన్నది క్లారిటీ ఉండేది కాదు. కానీ ఏం చేసినా ఇండ్రస్ట్రీలోనే అనేది మాత్రం క్లియర్ గా తెలుసు. మా ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణమే ఉండేది. నాన్నగారికి నన్ను దర్శకుడిగా లేదా నిర్మాతగా చూడాలని ఉండేది. నన్ను నిర్మాతను చేయడం కోసం ‘చాలా బాగుంది’ సినిమాకి క్యాషియర్ గా పని చేసే అవకాశమిచ్చారు. ఐతే నాకు మాత్రం హీరో అవ్వాలని ఉండేది. కానీ నేను హీరో అయితే నన్ను చూస్తారా.. బాగుంటానా అని సందేహాలుండేవి.కానీ నాన్నకు చెప్పలేకపోయేవాడిని. ఇలాంటి టైంలో ‘చాలాబాగుంది’ 100 డేస్ వేడుకకు అమితాబ్ బచ్చన్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. నాన్న నన్ను పరిచయం చేయగానే.. హైటెంత అని అడిగారు. 6.2 అని చెప్పగానే నేను హీరో అవుతానని చెప్పారు. వీడిని హీరో చేస్తున్నాట్టే కదా అని కూడా నాన్నతో అన్నారు. నాన్న మొహమాటం కొద్దీ తలూపారు కానీ తర్వాత పట్టించుకోనట్లే ఉండిపోయారు. ఆ తర్వాత ఒక రోజు ధైర్యం చేసే హీరో అవ్వాలనుందని నాన్నకు చెప్పా. అమితాబ్ గారు అంతకుముందు అన్న మాటలు కూడా గుర్తు చేశా. దీంతో నాన్న సరే అనేశారు’’ అంటూ తాను హీరో కావడానికి పరోక్షంగా అమితాబ్ ఎలా కారణమయ్యాడో వివరించాడు నరేష్.