Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: సైరాకు బిగ్ బి బైబై
By: Tupaki Desk | 16 March 2019 11:35 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందుతున్న సైరా షూటింగ్ కీలక దశలో ఉంది. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ప్రధాన ఆకర్షణగా బిగ్ బి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీని పని మీదే హైదరాబాద్ వచ్చిన అమితాబ్ తన భాగం పూర్తి చేసుకుని సైరా టీమ్ కు గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి దీన్ని ధృవీకరిస్తూ అమితాబ్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.
దీని తర్వాత ఏదో ముంబై షెడ్యూల్ ఉంటుందన్నారు కానీ అలాంటిది ఏమి ఉండకపోవచ్చు. చిరు ఇంట్లో స్పెషల్ లంచ్ లేదా డిన్నర్ తీసుకుని బిగ్ బి సైరాతో అనుబంధాన్ని పూర్తి చేసుకోనున్నారు. అమితాబ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు కొన్ని ఆన్ లైన్ లీక్ ఫొటోస్ గతంలోనే బయటికి వచ్చాయి. సో దాని పరంగా సస్పెన్స్ ఏమి లేదు. సినిమా మొత్తంలో పదిహేను నుంచి ఇరవై నిముషాలు మాత్రమే కనిపించే పాత్రలో అమితాబ్ నరసింహరెడ్డికి గురుబోధ చేసే విధంగా ఉంటుందట.
ఒక పోరాట సన్నివేశంతో బిగ్ బి రోల్ ముగుస్తుందని యూనిట్ టాక్. అమితాబ్ చిరంజీవిల ఒకేసారి తెరమీద చూడాలన్న అరుదైన ఊహాకు వాస్తవ రూపం ఇవ్వబోతోంది సైరా. అమిత్ త్రివేది సంగీతం అందించిన సైరా గ్రాఫిక్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందని తెలిసింది. దసరా విడుదల గురించి చరణ్ ఇంతకు ముందే హింట్ ఇచ్చాడు కాబట్టి ఇంకో ఆరు నెలలు వేచి చూస్తే చాలు