Begin typing your search above and press return to search.

మేం విల‌న్లం కాదు, మాకూ హార్ట్ ఉంది

By:  Tupaki Desk   |   12 Oct 2015 6:55 AM GMT
మేం విల‌న్లం కాదు, మాకూ హార్ట్ ఉంది
X
ఏంటి ఉన్న‌ట్టుండి ఇలా!!... విల‌న్లం కాం.. మాక్కూడా హృద‌యం ఉంది ... అంటూ మెగాస్టార్‌ చిరంజీవి అంత‌టివాడు ప్ర‌స్థావించాల్సిన సంద‌ర్భం ఏం వ‌చ్చింది? అని అనుకుంటున్నారా? అవును వ‌చ్చింది. అయితే ఆ సంద‌ర్భం టాలీవుడ్ మెగాస్టార్‌ కి కాదు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌ కి. బిగ్‌బి నిన్న‌టి రోజున బోలెడంత ఎమోష‌న్ అయ్యారు. ఆజ్ కి రాత్ హై జింద‌గీ అనే టీవీ కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వ క‌ర్టెన్‌ రైజ‌ర్‌ లో మ‌న దేశం, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు త‌దిత‌ర విష‌యాల‌పై మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు.

దేశంలో క‌రువు వ‌ల్ల, అప్పుల బాధ‌ల వ‌ల్ల‌ రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. కేవ‌లం 5 వేలు చెల్లించ‌లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతులు ఉన్నారు. అలాంటివారికి మీ సినిమావాళ్లు ఏమీ చేయ‌రా? అన్న ప్ర‌శ్న‌కు .. బిగ్‌ బి ఎంతో చ‌లించిపోయి మాట్లాడారు. నేను ఎంద‌రో రైతుల‌కు సాయం చేశాను. 5వేలు చెల్లించ‌లేక చ‌నిపోయిన రైతు గురించి తెలుసుకున్నా.. అలాంటి 5వేల అప్పులు చెల్లించి దాదాపు 50 మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోకుండా ఆపాన‌ని చెప్పారు బిగ్‌ బి. అయితే ఆ విష‌యాన్ని ఎప్పుడూ ప‌బ్లిక్‌ లో చెప్పుకోలేద‌ని, ఆ వార్త‌ల‌న్నీ ఇప్పుడున్న విస్ర్త‌త మీడియాలో దాచ‌లేమ‌ని అన్నారు. ఏదోలా బైటికి తెలిసిపోతూనే ఉన్నాయ‌ని అన్నారు.

ప‌రిశ్ర‌మ అనేస‌రికి చుల‌క‌న ఎందుకు? మేం విల‌న్లం కాము, మాకూ హార్ట్ ఉంది. మేం ప్ర‌తిసారీ స్పందిస్తున్నాం. ప్ర‌జ‌ల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా సాయానికి ముందుకు వ‌స్తున్నాం. క్రికెట్ పేరుతో చారిటీ ద్వారా వ‌చ్చిన మొత్తాల్ని ఆప‌న్నుల కోసం కేటాయిస్తున్నామ‌ని అమితాబ్ గుర్తు చేశారు ఈ సంద‌ర్భంగా. కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి - బిగ్ బాస్ 3 - యుధ్ వంటి రియాలిటీ షోల కోవ‌లోనే బిగ్‌ బి ప్ర‌మోట్ చేస్తున్న నాలుగో రియాలిటీ షో ఇది.