Begin typing your search above and press return to search.

మనవరాళ్లకు లెటర్ రాసిన మెగాస్టార్

By:  Tupaki Desk   |   6 Sep 2016 7:30 AM GMT
మనవరాళ్లకు లెటర్ రాసిన మెగాస్టార్
X
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఇద్దరు మనవరాళ్లకు ఓ లేఖ రాశారు. కూతురుకి కూతురు అయిన నవ్య నవేలి నందా.. కొడుకు కూతురు అయిన ఆరాధ్యలను ఉద్దేశిస్తూ రాసిన ఈ లెటర్ ను అభిమానులతో పంచుకుని.. వారి అమూల్యమైన అభిప్రాయాలను కూడా అడిగారు బిగ్ బీ.

'ముత్తాతలు అయన హరివంశరాయ్ బచ్చన్.. హెచ్ నందల పేర్లు మీ ఇంటి పేర్లుగా ఉండడంతో మీ ఇంటిపేర్లుగా ఉండడంతో గుర్తింపు సహజంగానే వచ్చేస్తుంది. నంద అయినా.. బచ్చన్ అయినా.. మీరు మహిళలే. అందుకే ఇతరులు వారి ఆలోచనలు మీపై రుద్దేందుకు ట్రై చేస్తారు. ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలో కూడా చెప్పేస్తారు. వారి ఆలోచనల ప్రకారం కాకుండా.. మీ తెలివితేటలతో జీవితాన్ని లీడ్ చేయండి. స్కర్ట్ పొడవును బట్టి గౌరవం అనే మాటలను నమ్మకండి. నచ్చివారినే పెళ్లి చేసుకోండి. మీ తప్పొప్పులకు మీరే కర్త క్రియ అవండి' అంటూ రాసిన అమితాబ్.. నవ్య-ఆరాధ్యలకు విడివిడిగా కూడా కొన్ని సూచనలు చేశారు

'ఇంటిపేరు ఓ మహిళ ఎదుర్కునే కష్టాల నుంచి కాపాడలేదు. వాటి నుంచి నిన్ను నువ్వే రక్షించుకోవాలి' అని నవ్యకు.. 'ఈ లెటర్ సారాంశం అర్ధమయ్యేనాటికి నేను ఉండకపోవచ్చు. ఇవాళ నేను చెప్పే పరిస్థితులు అప్పటికీ ఇలానే ఉండచ్చు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కష్టమే. అయినా ఇతరులకు ఎగ్జాంపుల్ గా నిలిచే అవకాశం అప్పుడే వస్తుంది. నువ్వు ఇది చేస్తే నాకంటే ఎక్కువ సాధించిన దానివి అవుతావు' అంటూ అభిషేక్-ఐశ్వర్యల కూతురు ఆరాధ్యకు ప్రేమతో తాతయ్య అమితాబ్ లెటర్ రాశారు. ప్రస్తుతం అమితాబ్ వయసు 73 ఏళ్లు కాబట్టి.. తను నోటితో చెప్పలేనివి ఈ లెటర్ తో పంచుకున్నారన్న మాట.