Begin typing your search above and press return to search.

మాల్దీవ్స్ లో బచ్చన్ ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   5 Feb 2016 6:05 AM GMT
మాల్దీవ్స్ లో బచ్చన్ ఫ్యామిలీ
X
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అంతా ఇప్పుడు వెకేషన్ టూర్ ఉన్నారు. మాల్దీవ్స్ లో షికార్లు కొడుతున్నారు. అమితాబ్ బచ్చన్ - ఆయన భార్య జయా బచ్చన్ - కొడుకు అభిషేక్ బచ్చన్ - కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ - కూతురు శ్వేతా బచ్చన్ నందా - మనవరాలు ఆరాధ్య బచ్చన్ లు... అందరూ ఇలా ఒకే ఫోటో ఫ్రేమ్ లో చిక్కారు.

ఫిబ్రవరి 5న జూనియర్ బచ్చన్ అయిన అభిషేక్ పుట్టిన రోజు. 1976లో పుట్టిన ఈయన.. ఇప్పుడు 40 ఏళ్ల వయసు కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా కుటుంబం అంతా కలిసి ఇలా మాల్దీవ్స్ టూర్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. బర్త్ డే సందర్భంగా ఇచ్చిన పోజ్ లో కూడా ఓ క్లారిటీ భలే మెయింటెయిన్ చేశారు. తండ్రీకూతుళ్లు అమితాబ్-శ్వేతలు - తల్లీ కొడుకులు జయాబచ్చన్- అభిషేక్ లు - తల్లీ కూతుళ్లు ఐశ్వర్య-ఆరాధ్యలు.. జంటగా కూచుని ఇచ్చిన పోజ్ భలే చూడ ముచ్చటగా ఉంది.

వీరిలో శ్వేత మినహాయిస్తే.. మిగతా అందరూ వెండితెరపై మెరిసిపోయిన వారే. ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన తమ అభిమాన నటులందరూ ఒకేసారి కనిపించడంతో.. ఫ్యాన్స్ ఫుల్లు హ్యాపీగా ఉన్నారు.