Begin typing your search above and press return to search.
మెగాస్టార్ ఫ్యామిలీలో గొడవలా.. అవ్వ
By: Tupaki Desk | 10 Oct 2016 5:24 AM GMTగత కొంతకాలంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో బాగా గొడవలు జరిగిపోతున్నాయనే ప్రచారం ఉంది. ఇందుకు కారణం ఐశ్వర్యారాయ్ అని కూడా చెప్పేసుకుంటున్నారు. యే దిల్ హై ముష్కిల్ మూవీలో రణబీర్ కపూర్ తో కలిసి ఐశ్వర్యారాయ్ బచ్చన్ హాట్ గా నటించడం.. రొమాన్స్ చేసేయడం.. బిగ్ బీతో సహా అందరికీ కోపం తెచ్చిందన్నది ఆ టాక్. అభిషేక్ కూడా బాగా నొచ్చుకున్నాడని.. అందుకే ఐష్ తో కలిపి ఎక్కడా కనిపించడం లేదని ఓ న్యూస్ ఉంది.
అయితే.. ఇప్పుడివన్నీ రూమర్స్ మాత్రమే అని ఇన్ డైరెక్టుగా చెప్పేసింది బచ్చన్ ఫ్యామిలీ. అమితాబ్.. జయా బచ్చన్.. అభిషేక్.. ఐశ్వర్యా రాయ్.. ఆరాధ్య.. నవ్య నవేలీ నందా.. ఇలా మొత్తం అమితాబ్ ఫ్యామిలీ అంతా కలిసి ముంబైలోని ఖర్ సబర్బన్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపానికి వచ్చారు. అంతా ఒకరితో ఒకరు.. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉన్న ఆ ఫ్యామిలీని చూసేందుకు అక్కడున్న వాళ్లకు రెండు కళ్లు చాలలేదు.
అందరూ కలిసి రావడం.. దసరా సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేయడం చూస్తే.. అసలు ఈ కుటుంబంలో గొడవలు వచ్చాయని ఎలా రూమర్స్ క్రియేట్ చేయబుద్ధి వేసిందో అనిపించకమానదు. కానీ.. రూమర్స్ వచ్చినపుడు వీసమెత్తు కూడా రియాక్ట్ కాకుండా.. నేరుగా చేతలతో సమాధానం చెప్పిన బచ్చన్ ఫ్యామిలీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/