Begin typing your search above and press return to search.

అమితాబ్ బచ్చన్ కు రెండోసారి కరోనా.. ఆ షూటింగ్ లన్నీ బంద్

By:  Tupaki Desk   |   24 Aug 2022 4:14 AM GMT
అమితాబ్ బచ్చన్ కు రెండోసారి కరోనా.. ఆ షూటింగ్ లన్నీ బంద్
X
బాలీవుడ్ అగ్రహీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి కరోనా బారినపడ్డారు. గతంలో కరోనా బారినపడి కోలుకున్న ఆయనకు ఇప్పుడు మళ్లీ కరోనా సోకింది. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్‌లో అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆయన ప్రస్తుతం తన ప్రాజెక్ట్‌లు, వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియా, తన స్వంత బ్లాగ్ ద్వారా తన అభిమానులకు, ఫాలోవర్స్ కు తరచుగా తెలియజేస్తాడు. అమితాబ్ సోషల్ మీడియా పేజీలో, మంచి చిత్రాల నుండి అందమైన జీవిత పాఠాల వరకు షేర్ చేసి ఫ్యాన్స్ కు హితబోధ చేస్తుంటారు. ఆయన తరచుగా తన కుటుంబం గురించి హత్తుకునే సందేశాలను కూడా ట్వీట్ చేస్తాడు. అయితే తాజాగా అమితాబ్ తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను నిన్న ట్విట్టర్‌లో పంచుకున్నారు.

అమితాబ్ బచ్చన్ తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తన అనుచరులకు తెలియజేశారు. "నేను ఇప్పుడే కోవిడ్ 19 పాజిటివ్ పరీక్షించబడ్డాను. నా పరిసరాల్లో, నా చుట్టూ ఉన్న వారందరూ, దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి." అని సోషల్ మీడియాలో పిలుపునిచ్చాడు.

అమితాబ్ కు కరోనా సోకడం ఇది మొదటిసారి కాదు. ఇదివరకే సోకింది. జూలై 2020 లో కూడా పాజిటివ్ పరీక్షించబడ్డాడు. ఆ తర్వాత నానావతి ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు. తనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ స్వయంగా పరీక్షించుకోవాలని నటుడు విజ్ఞప్తి చేశాడు.

కరోనావైరస్ భయం బాలీవుడ్ లో విషాదం నింపింది. ఈ వైరస్ ధాటికి ఎంతో మంది ప్రముఖులు చనిపోయారు. ముఖ్యంగా 70 ఏళ్లు దాటిన అమితాబ్ లాంటి వారికి ఇది మరీ డేంజర్. ఇది ఇప్పుడు మన జీవితంలో ఒక భాగమైంది.. ప్రజలు, రెండు టీకాలు, ఒక బూస్టర్‌ డోసు వేసుకొని దీని నుంచి రక్షణ పొందాలని ప్రభుత్వం సూచిస్తోంది. వైరస్ యొక్క కొత్త వేరియంట్స్ ఇప్పటికీ మానవాళికి ముప్పును కలిగిస్తూనే ఉన్నాయి.

అమితాబ్ కు కరోనా సోకడంతో బాలీవుడ్‌లో తన షూటింగ్ కమిట్‌మెంట్‌లన్నింటినీ వచ్చే 1 వారం పాటు నిలిపివేస్తున్నట్లు అమితాబ్ తెలిపారు. నెగెటివ్ అని తేలేవరకూ కూడా షూటింగ్ కు వచ్చే పరిస్థితి లేదు.

అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి రాబోయే సీజన్‌ను షూట్ చేస్తున్నారు. అది విజయవంతంగా నడుస్తున్న క్విజ్ రియాలిటీ షో. రణబీర్ కపూర్ -అలియా భట్‌లతో కలిసి బ్రహ్మాస్త్రా, రష్మిక మందన్నతో కలిసి 'గుడ్ బై' , ప్రభాస్ మరియు దీపికా పదుకొనేతో కలిసి ప్రాజెక్ట్ కెలో కనిపిస్తాడు. హారర్ సినిమా కోసం రామ్ గోపాల్ వర్మతో చర్చలు కూడా జరుపుతున్నాడు.ఇవన్నీ కూడా అమితాబ్ కోలుకునే వరకూ ఆగిపోయినట్టే.