Begin typing your search above and press return to search.

రొమాంటిక్ కిస్సులు.. మెగాస్టార్ ఫీలయ్యారా?

By:  Tupaki Desk   |   2 Sep 2016 3:30 PM GMT
రొమాంటిక్ కిస్సులు.. మెగాస్టార్ ఫీలయ్యారా?
X
ధూమ్ 2 సినిమాలో కిస్సింగ్ సీన్.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫీలయ్యారని న్యూసి వచ్చింది. తరువాత యాక్షన్ రీప్లే సినిమాలో హాట్ లుక్స్. మళ్ళీ ఈయన ఫీలయ్యారని టాక్. ఇప్పుడు తాజాగా ఐశ్వర్య రాయ్ ఏకంగా ఒక యంగ్ హీరోయిన్ లెవెల్లో.. కుర్రాడు రణబీర్ కపూర్ కు చెంపలు అప్పగించి చప్పరించుకోమందిగా.. సో ఆయన మళ్లీ ఫీలయ్యారట.

ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ ఇలా అమితాబ్ ఫీలవ్వడం గురించే. అప్పట్లో అభిషేక్ బచ్చన్ తో ఐశ్వర్య రాయ్ పెళ్ళయినప్పటినుండి ఇలా ఐష్ ఏదన్నా హాట్ అవతారం ఎత్తేస్తే చాలు అందుకు బిగ్ బి ఫీలయ్యారని న్యూస్ వస్తుంటుంది. అయితే ఇన్ని రోజులూ ఐష్‌ కేవలం తన అందాల ప్రదర్శనతోనే సరిపెట్టింది కాబట్టి.. గడచిన ఐదారేళ్లుగా పెద్దగా టాకులు రాలేదు. కాని ఇప్పుడు కరణ్‌ జోహార్ తీసిన ''ఏ దిల్ హై ముష్కిల్'' సినిమాలో ఏకంగా రణబీర్ ఈమెను చెంపలను తప పెదాలతో తడిమేస్తూ చాలా స్టీమీ సన్నివేశాలే చేసినట్లున్నాడు. లిప్ లాకులు లాంటివి లేవని చెబుతూ.. ఇలా హాటు సన్నివేశాలు ఎలా తీశావ్ అంటూ కరణ్‌ జోహార్ మీద బిగ్ బి ఫైరింగ్ అయ్యారని వినిపిస్తోంది.

కాని భర్త అభిషేక్ మాత్రం ఇలాంటి కామెంట్లనూ రూమర్లనూ పట్టించుకోకుండా.. హ్యాపీగా భార్య సినిమా తాలూకు పోస్టర్లనూ టీజర్లనూ ట్వీట్లు చేస్తూ హ్యాపీగా కాలక్షేపం చేస్తున్నాడు.