Begin typing your search above and press return to search.
బిగ్ బి.. నోట మాట రాలేదు
By: Tupaki Desk | 25 Dec 2015 7:30 AM GMTప్రియాంక చోప్రా ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ కేరక్టర్స్ తో.. సింగిల్ గానే సినిమాలు లీడ్ చేసే స్థాయికి చేరుకుంది. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో ఎఫ్బీఐ రోల్ తర్వాత.. ప్రియాంక క్రేజ్ ప్రవంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో జై గంగాజల్ పేరుతో రూపొందుతున్న ఓ మూవీలో పోలీస్ పాత్రలో ప్రియాంక కనిపిస్తోంది.
12 ఏళ్ల క్రితం వచ్చిన గంగాజల్ మూవీ తరహాలోనే ఉన్నా.. ఇది సీక్వెల్ కాదని, ప్రత్యేకమైన కథ అని చెప్పాడు డైరెక్టర్. రీసెంట్ గా జై గంగాజల్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పాత్రలో ప్రియాంక చోప్రా నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు అందరూ ప్రశంసిస్తున్నారు. అందరిలోకి బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ పొగడ్తలు ప్రత్యేకమైనవిగా చెప్పాలి. "ప్రకాష్ ఝా, ప్రియాంకలు చూపించిన నైపుణ్యం చాలా గొప్పగా ఉంది. వారిని చూశాక నోట మాట రాలేదు" అంటూ ట్వీట్ చేశారు అమితాబ్.
బిగ్ బీ నుంచి వచ్చిన ప్రశంసతో ఉబ్బి తబ్బిబ్బయిన ప్రియాంక.. ఈ పోలీస్ పాత్రకు స్ఫూర్తి అమితాబ్ బచ్చనే అని చెప్పింది. "మీ ప్రశంసలకు ధన్యవాదాలు. ఈ యాంగ్రీ యంగ్ ఉమెన్ పాత్రకు రోల్ మోడల్ మీరే"అని ట్వీట్ చేసింది ప్రియాంక. జంజీర్ పోలీస్ ఆఫీసర్ పాత్రను యాంగ్రీ యంగ్ మ్యాన్ అయిన బిగ్ బీ.. సమర్ధవంతంగా పోషించి, బోలెడంత ప్రతిష్ట సంపాదించుకున్నారు. ఇక.. ఈ జై గంగాజల్ మూవీ.. 2016 మార్చి 4న రిలీజ్ కానుంది.