Begin typing your search above and press return to search.
విధి నిర్ణయం మార్చలేమన్న బిగ్ బి
By: Tupaki Desk | 19 July 2020 4:43 AM GMTబిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కోవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత వారం ముంబై నానావతి ఆసుపత్రిలోని కోవిడ్ 19 వార్డులో చేరారు. బిగ్ బితో పాటు అభిషేక్ బచ్చన్ ఈ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. శుక్రవారం సాయంత్రం వరకూ ఇంట్లో నిర్బంధంలో ఉన్న ఐశ్వర్య రాయ్ బచ్చన్ -ఆరాధ్య బచ్చన్లను కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో అమితాబ్ ఏం చేస్తున్నారు? అంటే ఆయన అక్కడా తన బ్లాగింగ్ హ్యాబిట్ ని విడిచిపెట్టలేదు. బిగ్ బి తన అభిమానులకు బ్లాగులో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. జవాబులివ్వడం ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా అమితాబ్ బ్లాగులో ప్రస్థావించిన విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆయన తన ఆత్మపరిశీలన గురించి తన ఆలోచనలను బ్లాగులో పొందుపరిచారు. నా గతం ఏమిటి? ఏది మంచి? ఏది చెడు? అన్నది ఆలోచిస్తాను అని నాన్న హరివంశరాయ్ బచ్చన్ అనేవారుట. ఇన్నాళ్లు తన జీవితమంతా విశ్లేషించుకునే తీరిక చిక్కలేదు. మంచి లేదా చెడు ఏమిటో ఆలోచించడానికి సమయం రాలేదు. ఇప్పుడు ఆసుపత్రిలో తన మనస్సులో తన గతానికి సంబంధించిన సంఘటనలను తిరిగి గుర్తు చేసుకున్నానని తెలిపారు.
``గజిబిజి జీవితపు హడావిడిలో నేను ఎప్పుడైనా ఎవరి నుంచైనా సహాయం పొందానా? అని ఎక్కడో కూర్చుని కాసేపు ఆలోచించాను .. నేను ఏమి చేసాను.. నేను ఏమి చెప్పాను? నేను ఏది నమ్ముతున్నాను .. ఏది మంచిది? ఏది చెడ్డది? విశ్లేషించుకునేందకు ఇప్పుడు నాకు సమయం దొరికింది`` అని బ్లాగులో రాశారు.
ఏదైనా సంఘటనను ఊహించగలిగినంత స్పష్టంగా మనసు గుర్తించగలదు. గతంలో చేసిన పనులు వాటి ఫలితం .. ఒకవేళ అదే పనిని భిన్నంగా చేస్తే ఎలా ఉంటుంది? ఇంకా గొప్పగా చేసి ఉండేవాళ్లం కదా? అనిపిస్తుంది. కొన్నిటిని అసలు చేయాలా వద్దా? అన్నది అవకాశం ఉంటే నిర్ణయించుకోగలం. కానీ అది రియాలిటీలో సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. మీరు ఆశ్చర్యపోతున్నారా .. .. కానీ మీరు ఎంత ఆశ్చర్యపోతున్నారో .. విధి నిర్ణయాలు విధిగానే ఉంటాయి`` అని బ్లాగులో వ్యాఖ్యానించారు. అంటే విధిరాతను ఎవరూ తప్పించుకోలేరనేదే అమితాబ్ భావన అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బిగ్ బి అభిమానులు తమ ఆరాధ్య నటుడు సహా ఆయన కుటుంబం త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్న సంగతి తెలిసిందే.