Begin typing your search above and press return to search.

అక్కడ జగపతిని రీప్లేస్ చేసింది మెగాస్టార్

By:  Tupaki Desk   |   7 July 2016 12:19 PM GMT
అక్కడ జగపతిని రీప్లేస్ చేసింది మెగాస్టార్
X
నెమ్మదిగా ఇండియన్ మార్కెట్ ను కబ్జా చేసేస్తోంది హాలీవుడ్. ఇంతకుముందు లాగా ఇంగ్లిష్ సినిమాల్ని లైట్ తీసుకునే పరిస్థితి లేదు. మన సినిమాలకే ఎసరు పెట్టేసి వసూళ్ల వర్షం కురిపించేస్తున్నాయి హాలీవుడ్ మూవీస్. ఈ ఏడాది ‘జంగిల్ బుక్’ సహా కొన్ని హాలీవుడ్ సినిమాలు ఇండియాలో కోట్లు కోట్లు కొల్లగొట్టాయి. జులై 15న విడుదల కాబోయే ‘ది బీఎఫ్జీ’ కూడా భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్ బర్గ్ రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమాను ఇండియాలోని పలు భాషల్లో అనువదిస్తున్నారు. ఆయా భాషలకు చెందిన ప్రముఖ నటులతో ఇందులోని ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పిస్తుండటం విశేషం.

ఆల్రెడీ తెలుగులో జగపతి బాబు ‘బీఎఫ్జీ’ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. తమిళంలో నాజర్ తన గొంతు అరువిచ్చాడు. హిందీలో వీళ్లిద్దరి కంటే పెద్ద నటుడు ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. ఆయనెవరో కాదు.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఇప్పటికే కొన్ని హాలీవుడ్ సినిమాలకు గాత్రం అందించిన అనుభవం అమితాబ్ కు ఉంది. ఈ సినిమాతో మరోసారి తన ప్రత్యేకత చూపిస్తున్నాడు. అమితాబ్ వాయిస్ అంటే దేశవ్యాప్తంగా జనాలు బాగా ఐడెంటిఫై అవుతారు కాబట్టి ఈ సినిమాకు ఆయన గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మనుషుల కంటే మూడు రెట్ల పొడవుండే విచిత్రమైన వ్యక్తితో ఓ చిన్నారి పాప స్నేహం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం హాలీవుడ్లో రిలీజైంది. రెస్పాన్స్ పర్వాలేదు. మరి ఇండియాలో ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.