Begin typing your search above and press return to search.
మెగాస్టార్ తో తాప్సీ రొమాన్స్ లేనట్టే
By: Tupaki Desk | 21 Jan 2016 3:30 AM GMTబాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్.. లేటు వయసులోనూ సినిమాల మీద సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు బాక్సాఫీస్ దగ్గర పర్ ఫెక్ట్ కాంపిటీషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోయిన్లు అందరూ రెడీ. అలాగే అమితాబ్ కూడా యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేసిన సందర్భాలున్నాయి. జియా ఖాన్ తో చేసిన నిశ్శబ్ద్ అందుకు ఉదాహరణ.
అయితే ఈ మధ్యన ఎక్కువగా తండ్రి.. లేదా ఏదైనా పెద్దరికం ఉన్న పాత్రలనే చేస్తున్న అమితాబ్.. కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తారా అంటే.. నో ఛాన్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందని, టీనేజ్ బ్యూటీస్ తో తాతయ్యలు డ్యాన్సులాడితే ఆడియెన్స్ పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవడం లేదని తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు. దీపికతో పీకూ సినిమా చేసిన బిగ్ బి.. కావాలంటే కంగనా రనౌత్ తో కూడా నటిస్తాను కాని.. రొమాన్స్ చేయనూ అన్నారు.
ఇప్పుడు బిగ్ బి తదుపరి సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. షూజిత్ సర్కార్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో అమ్మడు బిగ్ బితో రొమాన్స్ చేస్తుందని అనుకున్నారు. కాని అలాంటిదేం లేదని ఇప్పడు అర్ధమైపోయింది.