Begin typing your search above and press return to search.

ఫేక్ వార్త‌ల క‌ల‌క‌లం: క‌స్సుమ‌న్న అమితాబ్‌

By:  Tupaki Desk   |   17 Nov 2017 2:08 PM GMT
ఫేక్ వార్త‌ల క‌ల‌క‌లం: క‌స్సుమ‌న్న అమితాబ్‌
X
ఇటీవ‌లి కాలంలో మీడియా విస్తృతి పెర‌గ‌డం - సోష‌ల్ మీడియా జోరు కొన‌సాగుతుండ‌టంతో...ఏది నిజ‌మో...ఏది అబ‌ద్ద‌మో అర్థం కాని ప‌రిస్థితి. గ‌తంలో ఒక వార్త వ‌స్తే..దాన్ని ఏదో రూపంలో క్రాస్ చెక్ చేసుకునే చాన్స్ ద‌క్కేది. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారిపోయింది. ఒక సంఘ‌ట‌న జ‌రిగిందో లేదో తెలియ‌క ముందే..అది వైర‌ల్ అయిపోతోంది. కొంద‌రు సెల‌బ్రిటీల‌కు అయితే ఇది మ‌రో ఇబ్బందిక‌ర‌మైన అనుభ‌వాల‌ను క‌లిగిస్తోంది. బ్ర‌తికి ఉండ‌గానే...చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు రావ‌డం - తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు వెల్ల‌డించ‌డం - ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించ‌డం వంటివి ఇందులో కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు.

ఇలాగే గ‌తంలో ప‌లు సంఘ‌ట‌న‌లు జ‌రిగిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ప్ర‌ముఖ సినీ న‌టులు ఏవీఎస్‌ - మ‌ల్లిఖార్జున‌రావు - సుధాక‌ర్ ఇటీవ‌ల కోట శ్రీ‌నివాస‌రావు విష‌యంలో వాస్త‌వ విరుద్ధ‌మైన అంశాల‌ను ప్ర‌చారంలో పెట్టారు. తాజాగా ఇది బిగ్‌ బీ అమితాబ్ బచ్చ‌న్‌ కు సైతం వ‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. 23వ కోల్‌ క‌తా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు కోల్‌ క‌తా వెళ్లిన అమితాబ్ తృటిలో ప్రాణాపాయం నుండి త‌ప్పించుకున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇది ఒక్క‌సారిగా ప‌లువురిని క‌ల‌వ‌రానికి గురిచేసింది.ఫిలిం ఫెస్టివ‌ల్‌ లో పాల్గొనేందుకు కోల్‌ క‌తా వెళ్లిన అమితాబ్ కార్య‌క్ర‌మం ముగించుకొని విమానాశ్ర‌యానికి వెళుతున్న స‌మ‌యంలో ఆయ‌న కారు వెనుక చ‌క్రం ఊడిపోయి ప్ర‌మాదానికి గురైన‌ట్టు ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో అమితాబ్ తో పాటు సీనియ‌ర్ మంత్రి కూడా ఉన్నార‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి.

అయితే అవ‌న్నీ అవాస్త‌వ‌మ‌ని బిగ్ బీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. ``నాకు ఎలాంటి యాక్సిడెంట్ జ‌ర‌గ‌లేదు. క్షేమంగానే ఉన్నాను`` అని ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. అసలు ప్రమాదమే జరగనప్పుడు, గాయాలపాలయ్యే అవకాశమెక్కడుంటుంది.?. ఫేక్‌ న్యూస్‌తో సెలబ్రిటీలను చంపేయొద్దని బిగ్‌-బి విజ్ఞప్తి చేశారు. ఈ వివ‌రాల‌లోకి వెళితే అమితాబ్ వివ‌ర‌ణ‌తో ఇవ‌న్నీ పుకార్లే అని తేలింది. కాగా, క‌నీసం కూడా తీసుకోకుండా...ఇంకా చెప్పాలంటే..త‌మ‌కు తోచిందే వార్త అనే రీతిలో ప్ర‌చారం చేయ‌డం స‌రికాద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం చూస్తుంటే..సెల‌బ్రిటీలను ఇలాంటి ఫేక్‌ వార్తలు ఎంత‌టి క‌ల‌వ‌రానికి గురి చేస్తాయో అర్థం చేసుకోవ‌చ్చున‌ని అంటున్నారు.