Begin typing your search above and press return to search.
రాత్రికి రాత్రే అమితాబ్ ని తొలగించారు!
By: Tupaki Desk | 11 Oct 2022 8:30 AM GMT1970వ దశకం ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ కెరీర్ కోసం పాకులాటలో ఎంతో శ్రమించేవారు. పరిశ్రమలో నిలదొక్కుకోవడం కోసం కష్టపడుతున్నప్పుడు 'దునియా కా మేళా' అనే కమర్షియల్ మాస్ మూవీకి సంతకం చేసారు. ఈ చిత్రానికి కుందన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈరోజుల్లో యువతకు అంతగా తెలియని పేరు ఇది. కానీ 1960లు 70లలో అతడు పాపులరయ్యారు. కుందన్ కుమార్ వరుసగా గంగా మైయా తోహే పియారీ చదైబో (1962 భారతదేశపు మొదటి భోజ్ పురి బ్లాక్ బస్టర్), ..ఔలాద్ (1968,.. జీతేంద్ర-బబిత నటించిన చిత్రం) వంటి మ్యూజికల్ హిట్ లను తెరకెక్కించారు.
1973లో అమితాబ్ బచ్చన్ జంజీర్ అతన్ని ఓవర్ నైట్ లో భారతదేశపు అతిపెద్ద స్టార్ గా మార్చడానికి ముందు కుందన్ కుమార్ ''రేఖ -అమితాబ్ బచ్చన్'' లతో 'దునియా కా మేళా'ను ప్రారంభించాడు. డిస్ట్రిబ్యూటర్లు కుందన్ కుమార్ ను మూర్ఖపు ఆలోచన అంటూ నివారించి అమితాబ్ కి వ్యతిరేకంగా సలహా ఇచ్చారు. అప్పటి వరకు అమితాబ్ సాత్ హిందుస్తానీ- ప్యార్ కి కహానీ- బాంబే టు గోవా- పర్వానా - గెహ్రీ చాల్ వంటి కొన్ని చిత్రాలలో మాత్రమే నటించారు. గత రెండు చిత్రాల్లో అమితాబ్ విలన్ పాత్రలు పోషించాడు. విలన్ లా శత్రుఘ్న సిన్హాగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
కానీ కుందన్ తన ఎంపికనే ఖాయం చేసుకుని ముందుకు వెళ్లారు. అతను హిట్-మేకర్లు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ స్వరపరిచిన యే చెహ్రా యే జుల్ఫెన్ జాదూ సా కర్ రహే హైన్ అనే శృంగార యుగళగీతం కూడా చిత్రీకరించాడు. రేఖపైనా దాదాపుగా కొత్తగా వచ్చిన అమితాబ్ బచ్చన్ పైనా ఆ పాటను చిత్రీకరించాడు. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు ప్రాజెక్ట్ నుంచి అమితాబ్ తప్పుకోవాలని బెదిరించారు. కొత్తగా వచ్చిన వ్యక్తిని తొలగించి అతని స్థానంలో మరింత పాపులర్ హీరోని తమకు అనుకూలమైన వాడిని నియమించాలని వారు కుందన్ కుమార్ కు సూచించారు.
బచ్చన్ ని రాత్రికి రాత్రే ఆ సినిమా నుంచి తీసేశారు. అతడికి ఆ విషయాన్ని కూడా సరిగా తెలియజేయలేదు. అతని స్థానంలో అప్పటి-హాట్ సేలబుల్ హీరో సంజయ్ ఖాన్ (ఆయన సినిమాలలో క్రెడిట్ టైటిల్స్ లో 'సంజయ్'గా మాత్రమే కనిపించాడు!) నటించారు. అతడు 60ల చివరలో 70ల ప్రారంభంలో అనేక విజయాలను అందించాడు.
1974లో దునియా క మేళా విడుదలయ్యే సమయానికి సంజయ్ ఖాన్ కెరీర్ పతనం వైపు దారితీసింది. జంజీర్ తర్వాత అమితాబ్ బచ్చన్ మొత్తం వినోద పరిశ్రమను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద స్టార్ గా ఎదిగారు. ఫ్లాప్‌గా మారిన దునియా క మేళాలోని అదే యుగళ గీతాన్ని బచ్చన్ -రేఖతో చిత్రీకరించేశారు అప్పటికే.. అయితే ఇది మరోసారి సంజయ్ - రేఖలతో రీ-షూట్ చేయాల్సొచ్చింది.
సాంకేతికంగా దునియా కా మేళా అమితాబ్-రేఖ నటించిన మొదటి చిత్రం.. అయితే 1976లో దో అంజానే మొదటి చిత్రంగా ఈ జోడీతో విడుదలైంది. (అయితే రేఖ అమితాబ్ బచ్చన్ ను వివాహం చేసుకున్న తర్వాత ప్రేమ్ చోప్రాతో పారిపోయిందని ప్రచారమైంది).
అమితాబ్ బచ్చన్ ఆ అనుభవాల గురించి మాట్లాడుతూ ఓసారి తనకు ఎలాంటి పగలు లేవని చెప్పారు. ''నేను ఫ్లాప్ లతో కష్టపడుతున్నాను. వారు నన్ను కూడా సినిమా కోసం పరిగణించినందుకు నేను కృతజ్ఞుడను. ఆ సమయంలో పెద్ద స్టార్ గా ఉన్న మిస్టర్ సంజయ్ ఖాన్ నా స్థానంలో ఉన్నారు... అని వినమ్రతతో మాట్లాడారు. అందుకే ఆయన అనతికాలంలోనే లెజెండరీ స్టార్ అయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.