Begin typing your search above and press return to search.

ఐశ్వర్య హాట్ సీన్స్.. ఆయనేం చెప్పారంటే

By:  Tupaki Desk   |   16 Nov 2016 5:20 AM GMT
ఐశ్వర్య హాట్ సీన్స్.. ఆయనేం చెప్పారంటే
X
కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందిన 'యే దిల్ హై ముష్కిల్' మూవీలో.. రణబీర్ కపూర్ తో ఐశ్వర్యారాయ్ ఇంటిమేట్ సీన్స్ చేయడంపై చాలానే హంగామా నడిచేసింది. బచ్చన్ ఫ్యామిలీ అంతా బాగా హర్ట్ అయ్యారని.. ఐష్ పై గుర్రుమన్నారనే టాక్ కూడా వచ్చింది. ఈ మూవీలో సీన్స్ ను అమితాబ్ కత్తిరించిమన్నారనే మాట కూడా నడిచేసింది. ఈ టాపిక్ పై ఇపుడు బిగ్ బీ రియాక్షన్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే.

ఎవరూ ఊహించలేని స్థాయిలో ఐశ్వర్యారాయ్ ను సపోర్ట్ చేశారు అమితాబ్. కోల్కతా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న బిగ్ బీ.. అక్కడ కోడలి చేసిన రోల్ ను ప్రస్తావించారు. 'సాబా స్వేచ్ఛ గల ఒక అమ్మాయి. తాను ప్రేమికుడికి అవసరంగానో అలవాటుగానో కాకుండా.. కోరుకునే లక్ష్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పి.. తిరిగి సరిదిద్దలేనంతగా మగవాళ్ల లెక్కలు మార్చేసింది' అంటూ ఐష్ రోల్ పై రియాక్షన్ ఇచ్చారు అమితాబ్ బచ్చన్.

సినిమాలో చేసిన ఈ రోల్ ప్రొఫెషనల్ మాత్రమేనని.. బిగ్ బీ ఫ్యామిలీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపలేదని చెప్పేందుకు.. బచ్చన్ సాబ్ నుంచి కోడలికి వచ్చిన ఈ సర్టిఫికేట్ ఒక్కటి చాలు. రీసెంట్ గా మీరు ఎలా ఉండాలని అనుకుంటే అలా ఉండండి అంటూ తన మనవరాళ్లకు అమితాబ్ రాసిన లెటర్.. అందరు మహిళలను ఉద్దేశించినదే కాబట్టి.. ఇదే రూల్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ కూడా అప్లే చేసేశారాయన.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/