Begin typing your search above and press return to search.
క్రియేటర్స్‌ని పైకి తెచ్చే బాధ్యత మనదే
By: Tupaki Desk | 3 Sep 2015 6:21 PM GMTబాలీవుడ్‌లో లెక్కకు మిక్కిలి సినిమాలు తెరకెక్కుతున్నా.. ఆశించిన స్థాయిలో వాటి నుంచి రెవెన్యూని ఆర్జించలేకపోతున్నామని అంటున్నారు బిగ్‌బి అమితాబ్. గొప్ప గొప్ప క్రియేటివ్ థాట్స్ తో సినిమాలు తీస్తున్నారు. నవతరం దర్శకుల్లో అపారమైన క్రియేటివిటీ ఉంది. కానీ ఏం లాభం.. మన ప్రొడక్ట్ ని ప్రపంచ వేదికపై పరిచయం చేసుకోవడంలో విఫలం అవుతున్నాం.. అంటూ పెదవి విరిచారు.
కొత్తవారిని, అంతగా బైటికి తెలియని ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్‌ని గుర్తించి మనమే వారికి ప్రోత్సాహాన్ని అందించాలి. అప్పటికే పరిశ్రమలో గొప్పగా ఉన్నవాళ్లనుంచి ప్రోత్సాహం రావాలి.. అంటూ సుదీర్ఘంగా తన ఉద్ధేశాల్ని ముచ్చటించారు బిగ్‌బి. ప్రస్తుతం అమితాబ్ హాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. అతడు 'ది గ్రేట్ గాట్స్ బి' అనే హాలీవుడ్ చిత్రంలో ఓ అతిధి పాత్రలో నటించారు. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్‌లో మట్లాడుతూ పైవిధంగా స్పందించారు. హాలీవుడ్ సినిమాలతో పోటీపడే సత్తా కంటెంట్ పరంగా ఉన్నా రెవెన్యూస్ లో వెనకబడడం విచారకరం అని అన్నారు. బిగ్ బి చెప్పినది నిజమే. అదే ఫార్ములాని తెలుగు పరిశ్రమకి అప్లయ్ చేయాలి. ఇక్కడ కూడా బోలెడంత ట్యాలెంట్ ఉంది. మంచి క్రియేటివిటీ ఉంది. అయితే దాన్ని బైటికి తెచ్చి రెవెన్యూ పెరిగే సినిమాల్ని తీసేందుకు పెద్ద స్థాయికి ఎదిగిన దర్శకనిర్మాతలు కృషి చేయాలి. స్వార్థం కోసం ప్రతిభను తొక్కేయకూడదు.
అందరికీ సరైన అవకాశం ఇస్తే మన తెలుగు సినిమా కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుంది. కేవలం రాజమౌళికి, సుకుమార్‌కి, త్రివిక్రమ్ కి మాత్రమే హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీసే ట్యాలెంటు ఉందనుకుంటే పొరపాటే. బోలెడంత మంది యూత్ అన్నివిధాలా రాటుదేలి ఉన్నారిక్కడ. అలాంటివారిని బైటికి తెచ్చే ప్రోత్సాహం ఎవరైనా చేస్తే బావుండేది.