Begin typing your search above and press return to search.
సైరా.. బచ్చన్ సార్ వస్తున్నారహో
By: Tupaki Desk | 24 March 2018 4:48 PM GMTమెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సైర సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తరువాత ఆ స్థాయిలో వస్తోన్న భారీ బడ్జెట్ సినిమా కావున ఇతర సినిమా ఇండస్ట్రీల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా గత కొన్ని నెలల నుంచి సెట్స్ పైకి వెళుతున్నట్లే అనిపించినా మళ్లీ బ్రేక్ పడుతోంది.
అయితే ఈ సారి ఆ విధంగా కాకూడదని నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇకపోతే సినిమాలో భారీ తారగణాన్ని సెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలతో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు. ఈ నెల 28 నుంచి హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో సినిమా షూటింగ్ జరగనుంది. అమితాబ్ బచ్చన్ డేట్స్ కూడా దాదాపు ఫైనల్ అయ్యాయి. మూడు రోజుల పాటు బచ్చన్ ఇక్కడే ఉండనున్నారు.
ఇక ఆ తరువాత మిగతా నటీనటులకి సంబంధించిన సీన్స్ ను దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. మొదట చిరంజీవి సురేందర్ రెడ్డి పై కొంచెం అనుమానంగా ఉన్నా.. ఆ తరువాత అతని కాన్ఫిడెన్స్ కి ఫిదా అయ్యారట. ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ రంగస్థలం సినిమా ఈ నెల 30న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.