Begin typing your search above and press return to search.
ఇంటర్నెట్లో మెగాస్టార్ క్లాస్!!
By: Tupaki Desk | 6 July 2017 4:40 AM GMTబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటే అతని పాత సినిమాలు చూసే అభిమాని కానక్కర్లేదు. ఇప్పుడు 100 చానెల్లు వచ్చిన తరవాత పుట్టిన వాడు కూడా అమితాబ్ అభిమానిగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అయన సినిమాలో నటించడం మొదలుపెట్టి ఆపేసి మళ్ళీ మొదలుపెట్టి యంగ్ అమితాబ్ గా ఉన్నప్పుడూ కన్నా ఎక్కువ అభిమానులును సంపాదించాడు. అమితాబ్ చేసిన సినిమాలు కావచ్చు అతని టివి హోస్ట్ చేస్తున్న పద్దతి కావచ్చు ఇప్పుడు అతను ఎంచుకుంటున్న సినిమాలు కావచ్చు అన్నీ కలిపి అమితాబ్ ను అందరూ మన ఇండియన్ సినిమాకు రారాజును చేశాయి. ఆయన సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంగా తన అభిమానులుతో టచ్ లో ఉంటాడు.
సమాజపు ధోరణి పై అమితాబ్ కు ఒక నిర్ధిష్ట నియమాలు ఉన్నాయి. అందులో ఒకటి మనకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని గౌరవించుకోవడం. ఈ విషయంలో అమితాబ్ చాలా ఖచ్చితంగా ఉంటాడు. మరి అలాంటి స్టారుకు ఒక కుర్రాడు కోపం తెప్పించాడు. అమితాబ్ కు ట్విటర్ లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు.. అందులో ఒక కుర్రాడు “నా తల్లిదండ్రులు చేస్తున్న పనులు పై నాకు కోపంగా ఉంది. నేను వాళ్ళని అడిగానా నన్ను కనండని? పోనీ కన్నారు నా బిల్లులు ఎవరు కడతారు?'' అని ట్వీట్ చేశాడు. దానికి మన బిగ్ బి కి ఒళ్ళుమండి “బాబు, నిన్ను కన్నవారు కూడా ఒకరికి పుట్టినవారే. వారు ఎప్పుడు నీలా బిల్లులు కట్టాలని బాధపడ్డారా?'' అని సూటిగా అడిగాడు.
దానితో ఆ అబ్బాయి తను ఎటువంటి మాట అనాలోచనంగా అనేసానో తెలుసుకొని సర్ నేను ఏదో సరదాగా అన్నాను అని నెమ్మదిగా ట్వీట్ చేశాడు. ఎవరికి మాత్రం అమ్మన్నా నాన్నన్నా ప్రేమ ఉండదు చెప్పండి.. అని ఆ అబ్బాయే అన్నాడు. ఏదేమైనా అమితాబ్ బచ్చన్ ఇచ్చిన క్లాస్ కు అక్కడ మిగతా వారు కూడా నువ్వు గ్రేట్ బచ్చన్ అంటూ తెగ పొగిడేసారు.