Begin typing your search above and press return to search.
రియల్ గా కూడా మెగాస్టార్ అనిపించుకున్నారు!
By: Tupaki Desk | 20 Oct 2018 6:22 AM GMTబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి - ఇతర స్టార్స్ కు ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ అమితా బచ్చన్ తాజాగా రైతుల పక్షాన నిల్చునేందుకు ముందుకు వచ్చారు. ఈసారి ఆయన చేపట్టిన కార్యక్రమం అందరికి ఆదర్శనీయంగా నిలవడంతో పాటు - షాకింగ్ గా కూడా అనిపిస్తోంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన దాదాపు 850 మంది అప్పుల బాధతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు బిగ్ బి పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చారు.
850 మంది రైతులు తీసుకున్న దాదాపు 5.5 కోట్ల రూపాయల అప్పులను అమితాబ్ తీర్చేందుకు సిద్దం అయ్యారు. అందుకు సంబంధించి బ్యాంకు అధికారులతో మాట్లాడటం కూడా జరిగింనది తెలుస్తోంది. గతంలో మహారాష్ట్రకు చెందిన రైతులు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను బిగ్ బి ఆదుకున్నారు. ఇప్పుడు అప్పుల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. గతంలో 44 మంది రైతు కుటుంబాలను ఆదుకున్న బిగ్ బి ఈసారి ఏకంగా 850 మంది రైతులను ఆదుకునేందుకు సిద్దం అయ్యారు.
రైతులు దేశానికి వెన్నుముక వంటి వారని, వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు తమకు చేతనైన సాయం చేయాలని, మహారాష్ట్రలోని 350 మంది తాము బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ఎవరైనా ముందుకు రావాలంటూ ఈ సందర్బంగా బిగ్ బి పిలుపునిచ్చాడు. రైతులను రుణ విముక్తులను చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులను కూడా ఆదుకొంటాం, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని బిగ్ బి విజ్ఞప్తి చేశారు.
హీరో అంటే సినిమాల్లో మంచి పనులు చేసి - రియల్ లైఫ్ లో తన జీవితం తాను బతికేవాడని అంతా అనుకుంటారు. కాని బిగ్ బి రైతులకు అండగా నిల్చునేందుకు ముందుకు రావడంతో ఆయన్ను రియల్ లైఫ్ మెగాస్టార్ అంటూ అభిమానులు కీర్తిస్తున్నారు. ఇతర స్టార్స్ కూడా రైతులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కోరుకుంటున్నారు.