Begin typing your search above and press return to search.
ఆయన మరణం తో దిగ్భ్రాంతి లో అమితాబ్
By: Tupaki Desk | 30 April 2020 10:10 AM GMTబాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మృతి నుండి పూర్తిగా కోలుకోక ముందే బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రిషీకపూర్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. 2018లో రిషీ క్యాన్సర్ బారినపడ్డారు. అప్పటి నుంచి న్యూయార్క్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ చేర్పించారు. ఆయన మృతికి సంబంధించిన విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన ట్వీట్లో తెలిపారు. ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు. రిషికపూర్ మరణంతో బిగ్ బి అమితాబ్ దిగ్బ్రాంతికి గురయ్యారు.
1970లలో సెన్సేషనల్ హిట్ చిత్రం బాబీతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన రిషీ కపూర్ లెజెండరీ హీరో రాజ్ కపూర్ రెండో వారసుడు. 1970లో 'మేరా నామ్ జోకర్' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఇక 1973లో బాబీ సినిమాలో మెయిన్ రోల్ పోషించి ఈ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డ్ కూడా పొందారు. 1973-2000 మధ్య అనేక బాక్సాఫీస్ హిట్లు కొట్టారు. 41 మల్టీస్టారర్ సినిమాలు చేసి ఇటీవల 102నాటౌట్ చిత్రంలో అమితాబ్ తో కలిసి నటించారు. చివరిగా ది బాడీ అనే చిత్రంలో నటించగా, శర్మాజీ నమ్‌కీన్ చిత్రం సెట్స్ పై ఉంది. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతనికి భార్య నీతూ సింగ్, పిల్లలు రిద్దిమా కపూర్, రణ్‌భీర్ కపూర్ ఉన్నారు.