Begin typing your search above and press return to search.
బట్టర్ ఫ్లై కోసం మెగాస్టార్ గొంతు
By: Tupaki Desk | 18 March 2019 9:01 AM GMTనాలుగు దశాబ్దాలుగా భారతీయ సినిమాలో ఒక భాగంగా మారి తనకంటూ ప్రత్యేక చరిత్ర సృష్టించుకున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మంచి గాయకుడన్న సంగతి తెలిసిందే. వీలు దొరికినప్పుడు తన స్వరం సూటయ్యే పాటలు ఆయనే స్వయంగా పాడుకోవడం హిందిలో చాలా సార్లు జరిగింది. ఈసారి తన గాత్రాన్ని ఆయన సౌత్ సినిమా కోసం ఇవ్వబోతున్నారు.
కన్నడలో రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న బటర్ ఫ్లైలో అమితాబ్ ఓ క్లబ్ సాంగ్ పాడబోతున్నారు. ఇది కంగనా రౌనత్ క్వీన్ కు రీమేక్. అక్కడ పరుల్ యాదవ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా తెలుగులో తమన్నా చేస్తోంది. దటీజ్ మహాలక్ష్మి పేరుతో విడుదలకు రెడీగా ఉంది. తమిళ్ లో కాజల్ అగర్వాల్ తో పారిస్ పారిస్ గా మలయాళంలో మంజిమా మోహన్ తో జామ్ జామ్ గా ఒకేసారి తెరకెక్కించారు. అయితే దర్శకులు వేర్వేరు
ఈ కారణంగానే అమితాబ్ గొంతు మనకు కన్నడ వెర్షన్ లో మాత్రమే వినిపిస్తుంది. ఇటీవలే సైరాలో తన షూటింగ్ పూర్తి చేసుకున్న అమితాబ్ ఈ మధ్య సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడీ పాటలో అమితాబ్ తో పాటు యుట్యూబ్ సెన్సేషన్ విద్యా వోక్స్ జత కలిసినట్టు తెలిసింది. దీన్నే పారిస్ లో ఓ నైట్ క్లబ్ ని నాలుగు రోజుల పాటు అద్దెకు తీసుకుని గణేష్ ఆచార్య నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు. తెలుగు వెర్షన్ లో ఈ పాట ఎలా ఉండబోతోంతో ఎవరితో పాడించారో ఇంకా తెలియాల్సి ఉంది. సరైన విడుదల తేదీ కోసం క్వీన్ నాలుగు బాషల రీమేక్ వెర్షన్లు ఎదురు చూస్తున్నాయి.