Begin typing your search above and press return to search.
ఒక ఫొటోతో దీనావస్థను చెప్పిన బిగ్ బి
By: Tupaki Desk | 10 July 2018 7:27 AM GMTఆధునిక సమాచార విప్లవం సమాజంలో ఎంత విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిందో.. అంతే స్థాయిలో మనుషుల మధ్య బంధాలను దూరం చేసిందని బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిరూపించారు. వేల పదాలతో చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటో షేర్ చేసి అందరికీ కనువిప్పు కలిగించాడు. బిగ్ బి అమితాబ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ గా మారింది.
పెరుగుతున్న సాంకేతికత మనుషులను ఎంత బానిసలుగా మార్చుతుందో.. మౌనమునులుగా తీర్చిదిద్దుతుందో చూడాలంటూ అమితాబ్ తన ఇంట్లోని ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. అమితాబ్ షేర్ చేసిన ఫొటోలో చిన్నారులు శ్వేతా బచ్చన్ నందా - అభిషేక్ బచ్చన్ - మనవళ్లు నవ్యా నావెలి నందా - అగస్త్య తదితరులందరూ ఒకే హాల్ లో కూర్చొని ఉన్నారు. అందరూ హాల్ లో ఒకరికి ఒకరు అందేంత దూరంలో కూర్చున్నా.. రూములో అంతమంది ఉన్నా ఆ గదిలో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. కారణం.. ప్రతీ ఒక్కరి చేతుల్లోనూ మొబైల్ ఉంది. అందరూ అందులోనే మునిగిపోయారు. తదేక దీక్షతో మొబైల్ ను ఆపరేట్ చేస్తూ ప్రపంచాన్ని మైమరిచిపోయారు.
‘అందరూ ఒక చోటే ఉన్నారు. వారితో ఫోన్లు కూడా ఉన్నాయి..’ అంటూ అమితాబ్ తన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలో ఒక్క నవ్య మాత్రమే పుస్తకం చదువుతూ కూర్చొంది. ప్రస్తుత పరిస్థితి అద్ధం పట్టింది ఈ ఫొటో..