Begin typing your search above and press return to search.
బచ్చన్ ఫ్యామిలీ కలతలు వాట్సప్ లో లీక్
By: Tupaki Desk | 15 Sep 2020 5:30 AM GMTమహమ్మారీ కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ ఎక్కడి వారు అక్కడే గప్ చుప్. తమకు నచ్చిన వాళ్లు.. బంధుమిత్రులు ఎక్కడ చిక్కుకున్నారోనన్న ఆందోళన లాక్ డౌన్ లో తప్పలేదు. ఈ సమయంలో అందరికి పెద్ద దిక్కుగా నిలిచింది సామాజిక మాధ్యమం అయిన వాట్సాప్. కావాల్సిన వారు ఎలా వున్నారో ఎక్కడ వున్నారో మెసేజ్ లు.. వీడియో కాల్స్ లో మాట్లాడేందుకు ప్రధాన సాధనంగా నిలిచింది. సామాన్యుల తరహాలోనే తమ వారి కోసం బచ్చన్ ఫ్యామిలీ కూడా ఇలానే టెన్షన్ పడిందంట.
దీన్ని అధిగమించడం కోసం బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేశారట. ఈ వాట్సాప్ గ్రూప్ లో ఐశ్వర్యారాయ్ నుంచి శ్వేతా బచ్చన్ వరకు బచ్చన్ ఫ్యామిలీ సభ్యులంతా వున్నారట. ఈ విషయాన్ని అభిషేక్ చ్చన్ కాఫీ విత్ కరణ్ షోలో బయటపెట్టేశాడు. ఈ గ్రూప్ లో అత్యంత స్పీడుగా స్పందించే వ్యక్తి బిగ్ బి అమితాబ్ బచ్చన్ అట. అత్యంత లేట్ గా స్పందించే వ్యక్తి ఐశ్యర్యారాయ్ అని అసలు సీక్రెట్ బయటపెట్టేశాడు.
ఇక తల్లి జయా బచ్చన్ గురించి కూడా ఆసక్తికరంగానే చెప్పాడు అభి. గ్రూప్ లో గుడ్ మార్నింగ్.. గుడ్ నైట్ వంటి మెసేజ్‌లు పెట్టడంలో మమ్మీ ఫస్ట్ అని ఆ తరువాతే ఎవరైనా అని చెప్పాడు. అంతే కాకుండా ఈ గ్రూప్ లో ఓ నియమం కూడా పెట్టుకున్నారట. ఎవరు ఎక్కడికి వెళుతున్నా ఆ విషయాన్ని ముందే గ్రూప్ లో పెట్టాలి. ఎప్పుడు వస్తున్నారు? ఎక్కడ వున్నారు.. ఎలా వున్నారు వంటి విషయాల్ని కూడా స్పష్టంగా తెలియజేయాలని నిబంధన కూడా పెట్టుకున్నారట.