Begin typing your search above and press return to search.
అమితాబ్ కు అప్పిచ్చినోళ్లు అలాంటి మాటల్ని అనేవారట
By: Tupaki Desk | 13 July 2021 3:55 AM GMTబిగ్ బీ.. బాలీవుడ్ సూపర స్టార్.. ఇలాంటి విశేషణాలు ఎన్ని వాడినా.. చివరకు వచ్చి ఆగేది మాత్రం అమితాబ్ బచ్చన్ అన్న పేరు దగ్గరకే. తిరుగులేని నట దిగ్గజం.. వంక పెట్టలేని వ్యక్తిత్వం.. అందరూ ఎంతగానో అభిమానించి.. గౌరవించే అమితాబ్ దాదాపు రెండు దశాబ్దాల క్రితం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోవటం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన ఎదుర్కొన్న అవమానాలు.. ఛీత్కారాల గురించి బయటకు చెప్పింది తక్కువే. ఆ మాటకు వస్తే.. ఆ చీకటి రోజుల్ని ప్రస్తావిస్తూ ఇంటర్వ్యూ చేసింది కూడా పెద్దగా లేదు. తాజాగా ఆ లోటు తీరుస్తూ ఒక ప్రముఖ మీడియా సంస్థ ఒకటి బిగ్ బి అప్పుల పాలైన రోజుల్లో ఆయన పరిస్థితి ఎలా ఉండేది? ఎలాంటి అవమానాల్ని ఆయన ఎదుర్కొన్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటమే కాదు.. అప్పటికే తిరుగులేని సూపర్ స్టార్ పొజిషన్ లో ఉన్న ఆయన.. ఏదైనా పని ఇప్పిస్తారా? అంటూ అడగాల్సిన పరిస్థితిలోకి ఆయన ఉండేవారన్న చేదు నిజాన్ని తాజాగా ఆయన వెల్లడించారు.
అప్పటివరకు నటనే ప్రపంచంగా బతికిన అమితాబ్.. అందుకు భిన్నంగా తొలిసారి వ్యాపారంలోకి అడుగు పెట్టారు. సినిమా నిర్మాణాలతో పాటు.. మరిన్ని కార్యకలాపాల్ని నిర్వహించేందుకు వీలుగా ఏబీసీ పేరుతో ఆయనో సంస్థ ఏర్పాటు చేశారు. ఆడంబరం.. అంతకు మించిన ఆర్భాటంతో ఆయన ఏర్పాటు చేసిన ఆ సంస్థ అప్పట్లో పెను సంచనలంగా మారింది. అదే సమయంలో ఆయన కెరీర్ సైతం డౌన్ ఫాల్ మొదలైంది. ఈ సంస్థ కారణంగా అమితాబ్ రూ.900 కోట్ల మేర అప్పులపాలయ్యారు. ఇప్పటికి రూ.900 కోట్ల అంటే షాక్ తినాల్సిందే. అలాంటిది 1999 నాటికి రూ.900 కోట్లు అంటే ఇప్పటి రోజులతో పోలిస్తే రూ.10వేల కోట్లకు సరి సమానం. ఇంతటి భారీ అప్పు మీద పడిన వేళ.. ఆయనకు అప్పిచ్చినోళ్లు ఆయనకు నరకాన్ని ప్రత్యక్షంగా చూపించేవారట.
ఆ అనుభవాల్ని అమితాబ్ గుర్తు చేసుకుంటూ.. 44 ఏళ్ల నా సినీ కెరీర్‌లో 1999 కాలం నిజంగా చీకటి రోజులే. ఆ సమయంలో నేను స్థాపించిన ఓ వెంచర్ దారుణంగా విఫలమయ్యింది. ఫలితంగా నా ముందు 900 కోట్ల రూపాయల అప్పు మిగిలింది. అప్పుల వాళ్ల ఇబ్బందులు ఎక్కువయ్యాయి. వారు నా ఇంటి దగ్గరకు వచ్చి నీచంగా మాట్లాడారు.. కొందరు ఏకంగా బెదిరించారు. ఆ సమయంలో ఏం చేయాలో నాకు పాలుపోలేదు. ఆ సమస్య నుంచి బయటపడతాననే నమ్మకం కూడా ఉండేది కాదు. ఏం చేయాలో.. ఎలా చేయాలో అస్సలు అర్థమయ్యేది కాదు’’ అని వెల్లడించారు.
ఆ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఒకసారి కూర్చొని.. మొత్తం ఇష్యూను ఎలా డీల్ చేయాలన్న దానిపై కసరత్తు చేసినట్లు ఆయన చెప్పారు. అప్పులన్ని తీర్చేయాలని తాను డిసైడ్ అయ్యానని.. అదే విషయాన్ని అందరికి చెప్పటంతో పాటు.. ఒకరి తర్వాత మరొకరు చొప్పున అప్పులు తీర్చటం మొదలుపెట్టినట్లు చెప్పారు. చివరకు దూరదర్శన్ కు పడిన బకాయిని సైతం తీర్చేసినట్లు వెల్లడించారు. డీడీకి చెల్లించాల్సిన మొత్తంలో కొంత మొత్తాన్ని.. వారు చెప్పిన ప్రకటనల్లో కనిపించినట్లు చెప్పారు.
అప్పు ఇచ్చిన వారు తనతో ప్రవర్తించిన తీరును మాత్రం తానెప్పటికి మర్చిపోలేనని.. వారి దూషణలు ఇప్పటికి గుర్తుకు వస్తాయన్నారు. ఇంటికి వచ్చి బెదిరించారని.. నిలదీశారని చెప్పారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్న తనకు 2000 సంవత్సరం తనకు బాగా కలిసి వచ్చినట్లు చెప్పారు. అప్పటికే సూపర్ స్టార్ ట్యాగ్ తో తిరుగులేని స్థానంలో ఉన్న అమితాబ్.. తన ఇంటి వెనుక ఉండే యష్ చోప్రా వద్దకు వెళ్లి.. తనకు ఏదైనా అవకాశం ఇప్పించాల్సిందిగా కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
తాను అడిగిన తర్వాత యష్ చోప్రా ఇచ్చిన అవకాశమే.. మొహబ్బతేన్ మూవీ. అది తనకు అదృష్టంగా మారిందని.. ఆ తర్వాత ఒక చానల్ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తాను చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి బాగా క్లిక్ కావటంతో.. జీవితం మళ్లీ మారిన విషయాన్ని ఆయన వెల్లడించారు. అప్పు అన్నదెంత దారుణ అనుభవాల్ని మిగులుస్తుందన్నది అమితాబ్ లాంటి వారికి సైతం అతీతం కాదన్న విషయం తాజాగా ఆయన చెప్పిన మాటలు స్పష్టం చేస్తాయని చెప్పక తప్పదు.