Begin typing your search above and press return to search.

12వ సారి 'కౌన్ బనేగా కరోడ్ పతి' అనబోతున్న బిగ్ బి

By:  Tupaki Desk   |   7 May 2020 11:30 PM GMT
12వ సారి కౌన్ బనేగా కరోడ్ పతి అనబోతున్న బిగ్ బి
X
టెలివిజన్ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రముఖ రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. ఇది వరకు సోనీ టెలివిజన్ ఛానెల్ బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా నిర్వహించి టెలివిజన్ ప్రేక్షకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన "కౌన్ బనేగా కరోడ్‌పతి" రియాల్టీ షో తిరిగి ప్రారంభం కానుంది. ఈ సీజన్-12 ప్రోగ్రామ్‌కు కూడా "బిగ్ బి"నే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అమితాబ్ పుట్టిన మే 9న ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కెబిసి సీజన్-12 ప్రైజ్ మనీ కూడా గతంలో లాగే భారీ రేంజ్ లో ఉండబోతుంది. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. ఇది వరకు నిర్వహించిన షో మాదిరిగానే ఇది కూడా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిగే మొదటి 12 ప్రశ్నలకు ప్రైజ్ మనీ ఒక కోటి రూపాయలు, చివరి ప్రశ్నకు మాత్రం రూ. 5 కోట్లు. ఇందులో ఓ ప్రత్యేక లైఫ్ లైన్ "ఆస్క్ యాన్ ఎక్స్‌పెర్ట్"ను పరిచయం చేయనున్నారు. మిగిలిన రెండు లైఫ్ లైన్లలో ఎలాంటి మార్పు ఉండదు.

"ఆడియన్స్ పోల్" (ప్రేక్షకుల ఎన్నిక), "ఆస్క్ ఏ ఫ్రెండ్" (స్నేహితుడిని అడుగు)లో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యధావిధిగానే ఉంటాయి. ఇదివరకు ఉన్న 50:50 లైఫ్ లైన్‌ను మాత్రం ఈ ప్రోగ్రామ్ నుంచి తొలగించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందు దేశవ్యాప్తంగానే గాక ప్రపంచంలోని బిగ్ బి అభిమానులు సైతం "కోటి" కళ్లతో వేచి చూస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ వ్యాఖ్య‌త‌గా రూపొందిన ఈ కార్య‌క్ర‌మం ఇప్ప‌టికే 11 సీజ‌న్స్ పూర్తి చేసుకొని 12వ సీజ‌న్ లోకి ఎంట‌ర్ అయ్యేందుకు సిద్ద‌మ‌వుతోంది. ‘లాక్ కర్‌దే’ అంటూ కోట్లాది ఆడియెన్స్ అభిమానాన్ని ఈ ప్రోగ్రామ్‌తో అందుకున్నారు బిగ్ బీ. తాజాగా కేబీస్ 12కి సంబంధించి ఆయ‌న‌ అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేశారు. మ‌న జీవితంలో ప్ర‌తి దానికి ఒక బ్రేక్ ఉంటుంది. కాని క‌ల‌ల‌కి కాదు. . మీ కలలకు కార్యరూపం దాల్చేందకు అమితాబ్ బ‌చ్చ‌న్ కేబీసీ 12తో బుల్లితెర‌పై రాబోతున్నారు. ఇంక‌ ఆల‌స్యం ఎందుకు.. మే 9న రాత్రి 9గం.ల నుండి ప్రారంభం కానున్న రిజిస్ట్రేష‌న్‌లో మీ పేరు రిజిస్ట్రేష‌న్ చేసుకోండి.. అని అమితాబ్ వీడియో ద్వారా వెల్ల‌డించారు. అతి త్వ‌ర‌లోనే ఈ షో సోనీ టీవీలో ప్ర‌సారం కానుంది.