Begin typing your search above and press return to search.
'నితిన్ కి డ్యాన్స్ రాదు.. నేనే వాడికి నేర్పించా'.. కొరియోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్..!
By: Tupaki Desk | 11 July 2022 10:10 AM GMTటాలీవుడ్ యువ హీరో నితిన్ పై డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నితిన్ కి అసలు డాన్స్ రాదని.. వాడికి డాన్స్ నేర్పించింది తానేనని అన్నాడు. ఓ గురువుగా నితిన్ తనకి రెస్పెక్ట్ ఇస్తాడని భావించామని.. కానీ అతనికి కృతజ్ఞతాభావం లేదనే విధంగా అమ్మ రాజశేఖర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మ రాజశేఖర్.. దర్శకుడిగా, నటుడిగా పలు సినిమాలు చేశాడు. డైరెక్టర్ గా 'రణం' 'ఖతర్నాక్' చిత్రాలు తీసిన ఫ్యాన్స్ మాస్టర్.. నితిన్ హీరోగా 'టక్కరి' అనే సినిమా తెరకెక్కించాడు. హీరోతో ఉన్న పరిచయంతో తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా రమ్మని పిలిస్తే రాలేదని అమ్మ రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మ రాజశేఖర్ స్వీయ నిర్మాణంలో 'హాయ్-ఫైవ్' అనే సినిమా తెరకెక్కింది. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నితిన్ ని ఆహ్వానించగా.. ముందుగా వస్తానని చెప్పి ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చాడని అమ్మ రాజశేఖర్ ఆరోపించాడు. స్టేజీపైనే నితిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు.
అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ''పది రోజుల ముందే ఈ సినిమా ఫంక్షన్ కు రమ్మని నితిన్ ని గెస్ట్ గా పిలిచాను. వస్తానని చెప్తే నేను నమ్మాను. ఎందుకంటే నితిన్ కు కెరీర్ ప్రారంభంలో డ్యాన్స్ రాదు. కానీ నేను డ్యాన్స్ నేర్పించి ఒక పొజిషన్ ఇచ్చాను. నన్ను ఒక గురువులా అయినా భావించి నా మీదున్న మర్యాదతో ఈ ఫంక్షన్ కి వస్తాడని అనుకున్నాను'' అని చెప్పారు.
''నితిన్ కోసం నేను అన్నం కూడా తినకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసా. కానీ ఆయన రాలేదు. రాకపోవడానికి కూడా కారణాల్లేవు. తనకు షూటింగ్ కూడా లేదు. ఇంట్లోనే ఉన్నాడు. ఫీవర్ అని చెప్పాడు. కనీసం ఒక వీడియో బైట్ అయినా అవ్వమని అడిగాను. కానీ ఇవ్వలేదు''
''ఒక్క విషయం చెప్తున్నా.. లైఫ్ లో మనం ఎలాంటి పొజిషన్ లో ఉన్నా దానికి సాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. ఇది ఈ హీరోకే కాదు.. అందరికీ చెప్తున్నా. ఎవరు అవసరమో వాళ్ళ ఫంక్షన్ కి మాత్రమే వెళ్తున్నారు. ఇప్పుడు నితిన్ నన్ను ఇన్సల్ట్ చేశాడు''
''ఆర్టిస్టులు అనేవాళ్ళు టెక్నిషియన్స్ ను ఒక ఫ్రూట్ లా చూస్తుంటారు. తినేసి విత్తనాల మాదిరిగా అవతల పడేస్తారు. కానీ ఆ విత్తనాలు మళ్లీ మొలకెత్తి ఒక చెట్టు అవుతుందని గుర్తు పెట్టుకోవాలి. అది మనం మర్చిపోకూడదు. లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇంతలా ఫీల్ అవుతున్నా'' అని అమ్మ రాజశేఖర్ ఎమోషనల్ అయ్యాడు.
''ఇది నా ఫస్ట్ ప్రొడక్షన్. నా నితిన్ తప్పకుండా వస్తాడని నేను నమ్మాను. నితిన్ నాకు చాలా చాలా క్లోజ్. అందరూ వచ్చారు కానీ నాకు కావాల్సిన ఆ వ్యక్తి రాలేదు. నేను చాలా అప్సెట్ అవుతున్నా. మనం ఏ స్థాయిలో ఉన్నా అమ్మని గురువును మర్చిపోకూడదు. వారిని మర్చిపోయిన వాళ్ళు సూపర్ స్టార్స్ అవ్వరు.''
''రావాలని లేకపోతే రాలేనని చెప్పాలి. కానీ వస్తానని చెప్పి మరీ రాకుండా నన్ను ఇలా ఇన్సల్ట్ చేసాడు. నితిన్.. నేను అప్ సెట్ అయ్యాను. దీనికి చాలా ఫీల్ అవుతున్నాను. నువ్వు నాకు ఎంతో క్లోజ్ అని చాలా నమ్మాను. కానీ ఇంట్లో ఉండి కూడా మీరు రాలేదు. లైఫ్ లో మనం మళ్లీ కలుద్దాం'' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.