Begin typing your search above and press return to search.
'ఒకే ఒక జీవితం' నుంచి హృదయాన్ని హత్తుకునే 'అమ్మ' పాట..!
By: Tupaki Desk | 26 Jan 2022 12:24 PM GMTయంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో మైలురాయి 30వ చిత్రం ''ఒకే ఒక జీవితం''. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమాతో శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇందులో శర్వా సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా.. అక్కినేని అమల కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ - స్నీక్ పీక్ - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో రిపబ్లిక్ డే స్పెషల్ గా తాజాగా ఫస్ట్ సింగిల్ 'అమ్మ' సాంగ్ ని రిలీజ్ చేశారు.
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని సోషల్ మీడియా వేదికగా 'అమ్మ' పాటను ఆవిష్కరించి తన తల్లి అమల అక్కినేనికి అంకితం చేశారు. ''#ఒకే ఒక జీవితం చిత్రం నుండి అమ్మ పాటను విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక గోల్డెన్ సాంగ్. ఖచ్చితంగా హృదయాన్ని హత్తుకుంటుంది. ఈ పాటను నా ప్రియమైన తల్లికి అంకితం చేస్తున్నాను. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్'' అని అఖిల్ ట్వీట్ చేశారు. అనునిత్యం వెంటాడే తీపి జ్ఞాపకాలతో ఈ పాట అమ్మకి అంకితమని చిత్ర బృందం పేర్కొంది.
'అమ్మా.. వినమ్మా.. నేనాటి నీలాలి పదాన్నే.. ఓ అవునమ్మా.. నేనేనమ్మా.. నువ్ ఏనాడో కనిపెంచిన స్వరాన్నే..' అంటూ సాగిన ఈ వినసొంపైన పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. జేక్స్ బీజోయ్ ఈ గీతానికి అద్భుతమైన స్వరాలు సమకూర్చగా.. గాయకుడు సిద్ శ్రీరామ్ తన గాత్రంతో మరోసారి మ్యూజిక్ చేశారు. హృదయాన్ని హత్తుకునేలా తల్లి యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పేలా లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు గొప్ప సాహిత్యాన్ని జోడించారు.
టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'ఒకే ఒక జీవితం' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శర్వానంద్ తల్లిగా అమల కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - నాజర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో సంభాషణలు రాశారు. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఎన్.సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు మరియు ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 'అమ్మ' పాటతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ''ఒకే ఒక జీవితం'' చిత్రం ఈ ఏడాది థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని ప్రకటించారు.