Begin typing your search above and press return to search.
అమ్మడు.. కోటి దాటేసి మరీ కుమ్ముడు
By: Tupaki Desk | 8 Jan 2017 11:37 AM GMTమెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 టీజర్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడు మొదలైన మెగాస్టార్ హంగామా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రోజుకో రికార్డ్ అన్నట్లుగా దూసుకుపోతోంది. టీజర్ తర్వాత ఈ మూవీలోంచి ఫస్ట్ సింగిల్ అంటూ 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' అంటూ ఓ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
కేవలం మెగాస్టార్.. కాజల్ ల ఫోటోలతోనే ఈ ఆడియో సాంగ్ ను మార్కెట్లోకి వదిలారు. ఆడియో ఫంక్షన్ చేయలేదు కాబట్టి.. సాంగ్స్ ను డైరెక్టుగా మార్కెట్లోకి వదులుతూ.. డిసెంబర్ 17న తొలి పాటగా అమ్మడు..కుమ్ముడు. పాటను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ పాట జనాలకు విపరీతంగా ఎక్కేసింది. అన్ని చోట్లా మార్మోగిపోతోంది. ఇప్పుడీ అమ్మడు సాధించిన యూట్యూబ్ వ్యూస్ ఎన్నో తెలుసా..? జస్ట్ ఇప్పుడే ఈ అమ్మడు.. కోటి వ్యూస్ ను దాటేసి మరీ కుమ్మేస్తోంది. ఓ తెలుగు ఆడియో సాంగ్ ఇలా కోటి వ్యూస్ ఇంత తక్కువ టైంలో సాధించడం కెవలం మెగాస్టార్ కి మాత్రమే సాధ్యమైన అరుదైన ఫీట్.
విడుదలైన 23వ రోజుకే కోటి వ్యూస్ సాధించిన తొలి తెలుగు లిరికల్ సాంగ్ గా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు కొత్త చరిత్ర సృష్టించేసింది. యూట్యూబ్ లోనే ఈ రేంజ్ హంగామా ఉంటే.. ఇక థియేటర్లలో మెగాస్టార్ స్టెప్పులతో కలిపి ఈ పాటను చూస్తే.. ఇక మెగా ఫ్యాన్స్ హంగామా ఆపసాధ్యమా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/