Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: అమ్మమ్మ కోసం ఏమైనా
By: Tupaki Desk | 23 April 2018 6:07 AM GMTఛలో ఇచ్చిన సక్సెస్ కిక్ తో హుషారు మీదున్న నాగశౌర్య కొత్త సినిమా అమ్మమ్మగారిల్లు విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా దీని టీజర్ విడుదలైంది. అనగనగా ఒక పల్లెటూరు. హీరో అమ్మ పుట్టిన ఊరైన అక్కడికి సెలవుల కోసం వెళ్తే తిరిగి రావాలి అనిపించలేనంతగా అక్కడివాళ్ళతో పెనవేసుకుపోతాడు. అమ్మమ్మ గుండెల్లో తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుని ఆమె కోసం ఏదైనా చేసే మనవడిగా మారతాడు. ఇదీ క్లుప్తంగా అమ్మమ్మగారిల్లు టీజర్ లో చూపించిన కథ. ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణం-స్వచ్చమైన మనసున్న మనుషులు-ఉమ్మడి కుటుంబాల మధ్య అనుబంధాలు ఇవన్ని టాలీవుడ్ కు పరిచయమవుతున్న దర్శకుడు సుందర్ సూర్య బాగానే కవర్ చేసాడు. ఈ మధ్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీస్ అన్ని మంచి రెస్పాన్స్ దక్కించుకున్న నేపధ్యంలో ఇది కూడా అదే కోవలోకి వచ్చేలా కనిపిస్తోంది. రావు రమేష్ మరోసారి తన బాడీ లాంగ్వేజ్ కి మ్యాచ్ అయ్యే పాత్రను దక్కించుకున్నారు.
ఇక ఇందులో మరో సర్ప్రైజ్ హీరొయిన్ శామిలి. అప్పుడెప్పుడో సిద్దార్థ్ ఓయ్ సినిమాలో బొద్దుగా కనిపించి మాయమైపోయిన శామిలి మళ్ళి దీని ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమాతో పోల్చుకుంటే క్యూట్ గా స్వీట్ గా అనిపిస్తున్న శామిలి ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం బహుశా అదేనేమో. శకలక శంకర్ కామెడీ పోర్షన్ తీసుకోగా సుమన్-సుధా-పోసాని-శివాజీరాజా మొత్తం ఫ్యామిలీ సెటప్ పెద్దదిగానే ఉంది. అతడు స్టైల్ లో యాక్షన్ డోస్ కూడా ఉంది లెండి. చివర్లో అమ్మమ్మ కళ్ళలో నీళ్ళు నా కళ్ళల్లోకి వచ్చేసాయి అని శౌర్యతో చెప్పించడం చూస్తే ఇది దేని గురించో అర్థమైపోతోంది. రసూల్ ఎల్లోర్ చాయాగ్రహణం పల్లె అందాలు చూపించగా కళ్యాణి రమణ సంగీతం బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టే స్మూత్ గా ఉంది. మొత్తానికి మరో ఫీల్ గుడ్ విలేజ్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తున్న అమ్మమ్మగారిల్లు వచ్చే నెల విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి