Begin typing your search above and press return to search.
నయనతారకు 'అమ్మోరు తల్లి' అనుగ్రహం లభించిందా..?
By: Tupaki Desk | 14 Nov 2020 2:34 PM GMTదక్షిణాది అగ్ర కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మూకుత్తి అమ్మన్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'అమ్మోరు తల్లి' పేరుతో అనువదించారు. నటుడు ఆర్జే బాలాజీ - శరవణన్ కలిసి దర్శకత్వం వహించారు. ఐసరి కె.గణేష్ నిర్మించారు. నయన తార దేవత పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. అలానే ట్రైలర్ విడుదలైన తర్వాత చెలరేగిన వివాదం కూడా ఈ సినిమాని వార్తల్లో నిలిపింది. ఇందులో నయన్ పోషించిన అమ్మవారి పాత్ర ద్వారా హిందూ భక్తులని తిట్టించడం అంటే హిందువుల మనోభావాలు కించపరిచడమే అని కొందరు ఆందోళన చేసారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని.. లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి వివాదాల మధ్య దీపావళి కానుకగా నవంబర్ 14న 'అమ్మారు తల్లి' సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల అయింది. మరి ఈ సినిమా నయనతారకు అమ్మోరు తల్లి అనుగ్రహం కలిగించిందో లేదో చూద్దాం!
కథ విషయానికొస్తే.. పెద్దగా గుర్తింపులేని ఉత్తరాంధ్ర టీవీ కోసం రామస్వామి(ఆర్.జె.బాలాజీ) కాశీబుగ్గ పట్టణంలో రిపోర్టర్ గా చేస్తుంటాడు. అయితే స్థానికంగా ఉండే ఓ స్వామీ చేస్తున్న భూ కబ్జా మీద స్టోరీ చేస్తే పెద్ద టీవీ ఛానల్ లో అవకాశం వస్తుందని ఆరేళ్లుగా దానిపై వర్క్ చేస్తుంటాడు. మరో వైపు రామస్వామి తల్లి బంగారం(ఊర్వశి) కొడుక్కి వేయి అబద్దాలు చెప్పైనా పెళ్లి చేయాలని చూస్తుంటుంది. అయితే రామస్వామి అవన్నీ అబద్దాలే అని నిజం చెప్తూ పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్లిపోయేలా చేస్తుంటాడు. దైవ భక్తి ఉన్న బంగారం తన కొడుకుతో కలిసి ఇంటి దైవం అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ రామస్వామికి అమ్మవారు దర్శనమిచ్చి.. తన గుడిని తిరుపతి అంత గొప్ప దేవాలయం చేయాలని కోరుతుంది. అసలు అమ్మవారు ఓ భక్తుడిని అలా ఎందుకు అడగాల్సి వచ్చింది? దానికి రామస్వామి ఏం చేశాడు. ఈ కథలో భగవతి బాబా(అజయ్‌ఘోష్) పాత్ర ఏంటి అనేదే మిగతా స్టోరీ.
నిజానికి దేవాలయాల నేపథ్యంలో దేవుడి మాన్యాల ఆక్రమణ.. దొంగ బాబాలు వంటి కాన్సెప్ట్ తో అనేక సినిమాలు వచ్చాయి. అయితే దేవుడు అనేది యూనివర్సల్ సబ్జెక్టు కావడంతో ఆర్జే బాలాజీ - శరవణన్ తొలిసారి దర్శకత్వం అయినా కూడా అదే కాన్సెప్ట్ ని ఎంచుకున్నారు. భక్తుల కోసం అమ్మవారు భూమికి దిగి రావడం.. మహిమలు చూపించి వాళ్ల కష్టాలు తీర్చడం.. భక్తి పేరుతో దొంగ బాబాలు మోసం చేయడం.. ఆశ్రమాల పేరుతో దేవుడు మాన్యాలను కాజేయడం.. చివరకు వాళ్లకు బుద్ధి చెప్పడం.. ఇలాంటి నేపథ్యంలో సినిమాలు వస్తుంటాయి. అయితే 'అమ్మోరు తల్లి' లో ఇదే అంశాలను కొంచెం కొత్తగా ఫన్నీగా చెప్పడానికి ప్రయత్నించారు. అదే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అమ్మోరు తల్లిగా నయనతార మంచి అభినయాన్ని కనబరిచింది. ఆమె రూపం ప్రేక్షకులను మెప్పించింది. ఇక మధ్య తరగతి కుర్రాడిగా బాలాజీ.. దొంగ బాబాగా అజయ్ ఘోష్.. బాలాజీ తల్లిగా ఊర్వశి నటన బాగుంది. అయితే కొందరు ఆందోళన చేసినట్లు దేవాలయాల గురించి ఒకటీ రెండు డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి. గిరీష్ గోపాలకృష్ణన్ నేపథ్య సంగీతం.. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తొలిసారి దర్శకత్వం వహించినా బాలాజీ - శరవణన్ బరువైన కథను బాగానే హ్యాండిల్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అభ్యంతరకర సన్నివేశాలను పక్కనపెడితే నయనతార 'అమ్మోరు తల్లి' ఓటీటీ ఆడియన్స్ ని మెప్పించిందనే చెప్పవచ్చు.